ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్రంగా జరుగుతున్న చర్చ కంటెంట్ డెలివరీ. ముఖ్యంగా ఓవర్సీస్ కు సకాలంలో డ్రైవ్స్ పంపకపోతే కలిగే ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉంటాయో ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రవాసాంధ్రులే కొరియర్ బాయ్స్ గా మారి డిస్కులను థియేటర్లకు వెళ్లి ఇవ్వాల్సి వచ్చిందంటే చివరి నిమిషం ఒత్తిళ్లను చూసి అర్థం చేసుకోవచ్చు. సరే ఇప్పుడంటే ఏదో అదృష్టం బాగుండి అందరి సహకారంతో ప్రీమియర్లకు ఢోకా లేదు కానీ ఒకవేళ భవిష్యత్తులో ఇదే సహకారం, ఇలాంటి అనుకూలతలు అందరికీ ఉండవుగా. ఈ విషయంలో ధనుష్ చాలా అడ్వాన్డ్ గా ఉన్నాడు.
అక్టోబర్ 1 విడుదల కాబోతున్న ఇడ్లి కొట్టు కాపీలు సిద్ధమైపోయాయి. ఏడు రోజుల ముందే ఈ లాంఛనం పూర్తి చేసుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు టెన్షన్ లేకుండా ఉంటారు. అయితే ఈ సినిమాని ఓజితో పోల్చడానికి లేదు. ఎందుకంటే స్కేల్, బడ్జెట్, ఆర్టిస్టుల పరంగా పవన్ కళ్యాణ్ మూవీ చాలా పెద్దది. కరెక్షన్లు సిజి వర్కులు బోలెడు ఉంటాయి. కాబట్టి ఆలస్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే డేట్ ఫిక్స్ చేసుకున్నాక దానికి అనుగుణంగా పనులను పరిగెత్తించాలి. కానీ ఓజి ఒత్తిడిని తప్పించుకోలేకపోయింది. అందుకే అమెరికా నుంచి హైదరాబాద్ దాకా ఫ్యాన్స్ డెలివరీ గురించి టెన్షన్ పడ్డారు.
ఇది కేవలం ఓజికి వచ్చిన ప్రాబ్లమ్ కాదు. కింగ్డమ్ కూడా చివరి నిమిషం దాకా ప్రెజర్ చూసింది. ఇంతకు ముందు కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలకూ రిపీట్ అయ్యింది. ఇది ఎక్కడిదాకా వెళ్లిందంటే విదేశాల్లోని డిస్ట్రిబ్యూటర్లు తెలుగు సినిమాల గురించి ఆలోచించేలా ఉన్నారు. ఇక ఇడ్లి కొట్టు విషయానికి వస్తే ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా తెలుగు, కన్నడ కన్నా తమిళ మార్కెట్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటోంది. దసరా పండగను వదులుకోకూడనే ఉద్దేశంతో ఓజి, కాంతారా చాప్టర్ 1 రూపంలో ఎంత తీవ్రమైన పోటీ ఉన్నా సరే బరిలో దిగుతోంది. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates