బిగ్‍బాస్ సీజన్ 4 చివరి వారానికి చేరుకోవడానికి ఈవారంతో కలుపుకుని ఇంకా మూడు వారాల సమయం వుంది. చివరి వారంలో అయిదుగురు మిగలాలి. అంటే ఇప్పుడు ఎనిమిది మంది హౌస్‍లో వుండాలి. కానీ ఏడుగురే మిగిలారు. దీంతో ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్లీ లోపలికి పంపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ కరోనా టైమ్‍లో అది మంచి ఆలోచన కాదని, అలాగే ఈ టైమ్‍లో రీఎంట్రీ అయితే అందరూ తిట్టిపోస్తారని ఆ ఐడియా డ్రాప్ అయ్యారు. అందుకే ఈవారం ఎలిమినేషన్ లేకుండా హౌస్‍లో వున్నవాళ్లకు ఒక వారం ఎక్స్టెన్షన్ ఇస్తున్నారట. ఈవారం నామినేట్ అయిన వారిలో అవినాష్ ఎలిమినేట్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది కనుక అతడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చారట.
అతడు దానిని వాడుకుని ఈ వారం సేఫ్ అయిపోతాడన్నమాట. ఇక వచ్చే రెండు వారాలలో ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అభిజీత్, సోహైల్ ఫైనల్ బెర్తులు ఖాయమని తేలిపోగా, మిగిలిన అయిదుగురిలోను ముగ్గురు మాత్రమే ఫైనల్ ఫైవ్‍లో చోటు దక్కించుకుంటారు. అవినాష్, అఖిల్‍లో ఒకరు… అరియానా, హారిక, మోనల్‍లలో ఒకరు ఎగ్జిట్ అవుతారనే సంకేతాలు అందుతున్నాయి. అవినాష్‍కి బిగ్‍బాస్ మళ్లీ మళ్లీ సాయం చేస్తూ పుష్ చేస్తున్నాడు కనుక అతడికి ఎలాగోలా ఫైనల్‍లో చోటిస్తే అఖిల్ ప్రమాదంలో పడతాడు.
This post was last modified on November 26, 2020 1:32 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…