లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఎలా పొగిడేవాడో తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు కూడా అవి టూమచ్ అనిపించేవి. పవన్‌ను పొగడ్డానికి మాటలే లేనట్లుగా కొత్త కొత్త పదాలు సృష్టించి ఆయన ట్వీట్లు వేసేవాడు. అలాంటి వ్యక్తే తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పే రోల్‌లోకి వెళ్లి పవన్ వ్యక్తిత్వ హననానికి ఎంతగా ప్రయత్నించాడో తెలిసిందే. ఓపక్క పవర్ స్టార్, వ్యూహం లాంటి సినిమాలతో పవన్‌ను కించపరిచే క్రమంలో దిగజారిపోయిన ఆర్జీవీ.. మరోవైపు తన స్థాయికి ఏమాత్రం తగని ట్వీట్లతోనూ వ్యక్తిగా పతనం అయిపోయాడు.
కానీ దీని వల్ల అటు వైసీపీకి ప్రయోజనం లేకపోయింది. ఇటు వర్మ కూడా అథ:పాతాళానికి పడిపోయాడు. ఆ తర్వాత రాజకీయాలకు టాటా చెప్పేసి, క్రెడిబిలిటీ తిరిగి తెచ్చుకోవడానికి వర్మ ఎంత ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వర్మ వేసిన ‘మెగా’ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేయాలని వర్మ ఆకాంక్షించాడు. సోమవారం చిరంజీవి సినీ జీవితంలో 47 ఏళ్లు నిండాయి. ఆయన తొలి చిత్రం 1978 సెప్టెంబరు 22నే రిలీజైంది. ఈ సందర్భంగా చిరు ఒక స్పెషల్ ట్వీట్‌తో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అలాగే తన మీద ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ట్వీట్‌పై పవన్ కూడా స్పందిస్తూ తన అన్నయ్యను కొనియాడాడు. ఈ రెండు ట్వీట్లను ఉటంకిస్తూ వర్మ ఒక పోస్ట్ పెట్టాడు. చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ అది ఒక మెగా పవర్ ఫేవర్ అవుతుందని.. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ ఫిలిం అవుతుందని వర్మ వ్యాఖ్యానించాడు. కొన్నేళ్ల కిందట పవన్ మీద నెగెటివ్ ట్వీట్లు వేయడం మొదలు పెట్టాక.. వర్మ మళ్లీ పవర్ స్టార్‌ను ఉద్దేశించి వేసిన పాజిటివ్ ట్వీట్ కావడంతో ఇది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. కానీ వర్మను ఇక ఎప్పటికీ నమ్మలేం అంటూ ఆయన మీద చాలామంది కౌంటర్లే వేశారు.
This post was last modified on September 23, 2025 7:32 am
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…