రెండేళ్లకు పైగా ఓజి నామస్మరణలో మునిగి తేలుతూ ఆఖరికి పవన్ కళ్యాణ్ రాజకీయ సామజిక సమావేశాల్లో కూడా ఈ సినిమా ప్రస్తావనే పదే పదే తీసుకొస్తున్న అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. సెప్టెంబర్ 25 విడుదల కాబోతున్న ఓజికు ముందస్తు ట్రీట్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో స్పష్టత ఇచ్చే ట్రైలర్ ఆడియన్స్ ముందుకు తెచ్చేశారు. వాస్తవానికి నిన్న ఈవెంట్ లో లాంచ్ చేయడంతో పాటు ఆన్ లైన్ ఒకేసారి రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ చివరి నిముషం సాంకేతిక కారణాల వల్ల నెరవేరలేదు. అందుకే గంటల తరబడి ఆలస్యంగా అయినా ఎట్టకేలకు ఇవాళ యూట్యూబ్ లోకి తెచ్చేశారు.
స్టోరీని పెద్దగా దాచే ప్రయత్నం చేయలేదు. 90 దశకంలో ముంబై నగరాన్ని వణికిస్తున్న ఒమీ భావు (ఇమ్రాన్ హష్మీ) ని ఎదిరించాలంటే ఈ భూమ్మీద ఒక్క ఓజాస్ గంభీర అలియాస్ ఓజి (పవన్ కళ్యాణ్) వల్లే సాధ్యమవుతుందని గుర్తించిన సత్యదాదా (ప్రకాష్ రాజ్) అతన్ని పిలిపించే ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు మాఫియాని ఏలిన ఓజి అజ్ఞాతం నుంచి బయటికి వచ్చే సమయం ఆసన్నమవుతుంది. శత్రువుకు ఫోన్ చేసి మరీ నేను వస్తున్నా తలలు జాగ్రత్తని వార్నింగ్ ఇస్తాడు. అక్కడి నుంచి తప్పు చేసినవాళ్లను ముక్కలు ముక్కలుగా నరికే విలయ తాండవం మొదలవుతుంది. అసలు ఓజీ ముంబై ఎందుకు వదిలి వెళ్ళాడు, ఇప్పుడెందుకు వచ్చాడనేది అసలు కథ.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్ తన ఫ్యానిజం మొత్తం చూపించేశాడు. లైన్ పరంగా ఇదేమి కొత్తది కాదు, బాషా, సత్య నుంచి చాలాసార్లు చూసిందే. కానీ ఓజి కోసం ఎంచుకున్న నేపధ్యం, ఇంటెన్స్ డ్రామా, వైల్డ్ క్యారెక్టరైజేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. పవన్ ని ఇంత వయొలెంట్ షేడ్ లో చూస్తుంటే ఫ్యాన్స్ సరదాగా చెప్పుకునే శవాలు లేస్తాయి డైలాగ్ నిజమయ్యేలా ఉంది. బయటికి రివీల్ చేయని చాలా సర్ప్రైజులు ఓజి థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఎలివేట్ చేయగా రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం సాంకేతికంగా ఎత్తులో నిలబడింది. కేవలం పేరుకే ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఇక ట్రైలర్ చూశాక గంటలు సంవత్సరాలుగా అనిపించడం ఖాయం.
This post was last modified on September 22, 2025 2:58 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…