సినిమాలో జంటగా నటిస్తూ.. ఆ క్రమంలో ప్రేమలో పడ్డ జంటలు ఎన్నెన్నో. అందులో కొందరు తమ ప్రేమ బంధాలను పెళ్లి వరకు తీసుకెళ్తారు. కొందరేమో.. మధ్యలో విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటారు. ఈ మధ్య బాలీవుడ్లో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సైయారా’ సినిమాలో జంటగా నటించిన అహాన్ పాండే, అనీత్ పడ్డా సైతం ప్రేమలో పడ్డట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘సైయారా’లో నటించే సమయానికి వీరి గురించి సామాన్య జనానికి పెద్దగా తెలియదు. ఐతే పెద్దగా అనుభవం లేకపోయినా.. ‘సైయారా’లో అహాన్, అనీత్ అద్భుతంగా నటించి మెప్పించారు. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూస్తే.. నిజంగానే వారు ప్రేమికులా అనిపించేంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఐతే ఇదంతా నిజంగా ప్రేమలో ఉండబట్టే సాధ్యమైందని అంటున్నారు.
‘సైయారా’లో నటించేటపుడే అహాన్, అనీత్ ప్రేమలో పడ్డారట. నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఉన్న బాండింగే తెర మీద కూడా ప్రతిబింబించిందట. నిర్మాత యశ్ చోప్రాకు ఈ విషయం తెలిసినప్పటికీ.. కెరీర్‌లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఈ విషయం బహిర్గతపరచొద్దని హెచ్చరించాడట. అందుకే ఇప్పటిదాకా అధికారికంగా తమ రిలేషన్‌షిప్ గురించి అహాన్, అనీత్ బయటపెట్టలేదని ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంలో పేర్కొన్నారు.
అహాన్, అనీత్‌లకు ‘సైయారా’ రిలీజ్ తర్వాత అవకాశాలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఒప్పుకునే స్థితిలో లేరు. ‘సైయారా’ సక్సెస్‌ను ముందే ఊహించిన యశ్ చోప్రా.. తన సంస్థలోనే మూడు సినిమాల చొప్పున నటించేలా వీరితో ఒప్పందం చేసుకున్నాడు. అవి పూర్తయ్యాకే వేరే సినిమాల వైపు చూడబోతున్నారు అహాన్, అనీత్.
This post was last modified on September 21, 2025 3:00 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…