తేజ సజ్జ.. ఇప్పుడు పాన్ ఇండియా మార్మోగిపోతున్న పేరు. గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’ సినిమాతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడతను. ఆ తర్వాత పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా ఒప్పుకోకుండా.. అప్పటికే మేకింగ్ దశలో ఉన్న ‘మిరాయ్’ మీద దృష్టిపెట్టాడు. అందుకు ఇప్పుడు మంచి ఫలితమే దక్కింది. ‘మిరాయ్’ సైతం బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. వంద కోట్ల వసూళ్ల మార్కును దాటి దూసుకెళ్తోంది.
ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రంతో మిడ్ రేంజ్ హీరోల్లో టాప్‌కు వెళ్లిపోయేలా ఉన్నాడు తేజ. అతను ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే మీమాంస లేకుండా.. తాను చేసిన మూడు సక్సెస్ ఫుల్ చిత్రాల సీక్వెల్స్‌తోనే అతను రాబోతున్నాడు.
తేజ హీరోగా నటించిన తొలి చిత్రం.. జాంబిరెడ్డి. అప్పటికి తనకు ఎలాంటి ఇమేజ్ లేదు. సినిమా కూడా ఓ మోస్తరుగా ఉంటుంది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి విజయాన్నందుకుంది. తర్వాత ‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలు ఘనవిజయాన్నందుకున్నాయి. ఈ మూడు చిత్రాలకూ సీక్వెల్స్ రాబోతున్నాయి. ‘జాంబి రెడ్డి’ సీక్వెల్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ‘మిరాయ్’ తీసిన పీపుల్ మీడియా సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతోంది. ప్రశాంత్ వర్మ ఈసారి కథకుడి పాత్రకే పరిమితం అవుతున్నాడు. దర్శకుడెవర్నది ఇంకా సస్పెన్సుగానే ఉంది. ‘హనుమాన్’కు సీక్వెల్ ప్రకటించి చాలా కాలమైంది. కానీ సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. ఈసారి రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో కనిపిస్తాడు. కానీ అందులో తేజ కూడా ఉంటాడు.
ఇంకోవైపు ‘మిరాయ్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని సినిమాలో హింట్ ఇచ్చారు. ముందు నుంచే ఈ దిశగా ప్లానింగ్ ఉన్నప్పటికీ.. ‘మిరాయ్’ ఫలితాన్ని బట్టే ముందుకు వెళ్లాలనుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని చివరి చిత్రం ‘ఈగల్’ ఫ్లాప్ కావడంతో ‘మిరాయ్’ సీక్వెల్ గురించి ముందే ప్రకటించి ఇబ్బంది పడడం ఎందుకు అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ‘జైత్రయ’ పేరుతో సీక్వెల్ చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. హీరో, దర్శకుడు, నిర్మాత.. ముగ్గురూ రెడీ. ‘జైత్రయ’లో రానా దగ్గుబాటి విలన్ పాత్ర చేయబోతున్నాడు. ఈ మూడు సీక్వెల్స్‌తో తేజ.. మూణ్నాలుగేళ్లు బిజీగా ఉండబోతున్నాడు. కాబట్టి కొత్తగా వేరే సినిమాలేవీ అనౌన్స్ అయ్యే అవకాశాలు లేవు.
This post was last modified on September 19, 2025 9:07 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…