ఓజీ.. ఓజీ.. ఓజీ.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల గుండెచప్పుడు ఇదే. ఆ మాటకొస్తే పవన్ ఫ్యాన్స్ కాని వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఈ మధ్య కాలంలో ఇంత హైప్ మరే సినిమాకూ రాలేదంటే అతిశయోక్తి కాదు. రెండు నెలల కిందటే పవన్ నుంచే ‘హరిహర వీరమల్లు’ సినిమా వచ్చింది. దానికి పెద్దగా బజ్ లేదు. ఆ సినిమా ప్రమోషన్లలో కూడా అభిమానులు ‘ఓజీ ఓజీ’ అంటూ అరిచిన పరిస్థితి.
‘ఓజీ’ సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ రాక ముందే విపరీతమైన హైప్ వచ్చింది. ఇప్పటిదాకా కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర బృందం. రెండేళ్ల ముందు రిలీజ్ చేసింది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. దానికే అభిమానులు ఊగిపోయారు. టీం షూటింగ్ ఆపేసి సైలెంట్‌గా ఉన్నపుడు కూడా దీనికి హైప్ తగ్గలేదు. తర్వాత పాటలు, వాటికి సంబంధించిన లిరికల్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేశారు. వాటికే హైప్ ఇంకా పెరిగిపోయింది.
యుఎస్‌లో ‘ఓజీ’కి అడ్వాన్స్ బుకింగ్స్ కొన్ని వారాల ముందు మొదలుపెట్టగా.. పెట్టిన షోలు పెట్టినట్లు అయిపోయాయి. కేవలం విడుదలకు ఇంకా వారం ఉండగానే ప్రి సేల్స్‌తోనే 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కేలం సినీ మార్క్ స్క్రీన్ల వరకే 1 మిలియన్ డాలర్ల ప్రి సేల్స్ జరగడం పెద్ద సంచలనం. భారీ హైప్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి బజ్ కనిపిస్తోంది ‘ఓజీ’కి.
పవన్ కళ్యాణ్ ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడితో జట్టు కడితే.. శ్రద్ధ పెట్టి మంచి కంటెంట్ ఉన్న స్ట్రెయిట్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘ఓజీ’నే రుజువు. ఆన్ లైన్లో తప్పితే.. ఆఫ్ లైన్లో ఇప్పటిదాాకా సినిమాకు ఏ రకమైన ప్రమోషన్ జరగలేదు. ఇక ముందూ జరక్కపోయినా ఇబ్బంది లేదు. ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇంతకుమించి హైప్ పెరిగినా కష్టమే అనుకునే పరిస్థితి ఉంది. ట్రైలర్ కూడా బాగుంటే ఇంకా హైప్ పెరిగిపోవడం ఖాయం. దాన్ని అందుకోవడం సుజీత్ అండ్ టీంకు అంత తేలిక కాదు. మరి అతను ‘ఓజీ’తో ఏమేర మెప్పిస్తాడో?
This post was last modified on September 19, 2025 9:03 pm
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…