Movie News

సోమవారం పరీక్షకు సర్వం సిద్ధం

సెప్టెంబర్ రెండో వారంలో సెకండ్ వీకెండ్ బ్రహ్మాండంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల థియేటర్లు జనాలతో కళకళలడాయి. పబ్లిక్ టాక్స్, రివ్యూలు కాసేపు పక్కనపెడితే జనాలు ఎంటర్ టైన్మెంట్ కోసం ఇల్లొదిలి హాళ్లకు వచ్చిన వైనం స్పష్టంగా కనిపించింది. గత రెండు మూడు నెలల్లో ప్యాన్ ఇండియా రిలీజులు ఉన్న టైంలోనూ ఇంత జోరు లేదన్న మాట వాస్తవం. ముఖ్యంగా మిరాయ్ ర్యాంపేజ్ మాములుగా లేదు. రెండు రోజులకే యాభై అయిదు కోట్లు దాటేయగా ఆదివారం ఇంకో పాతిక కోట్ల దాకా వచ్చి ఉండొచ్చని ప్రాధమిక అంచనా. మెయిన్ సెంటర్స్, లో టికెట్ ముక్క లేదన్న రేంజ్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి.

కొంచెం డివైడ్ టాక్ వినిపించినా కిష్కిందపురి సైతం అమాంతం పికప్ కావడం బయ్యర్ వర్గాలను సంతోషంలో ముంచెత్తింది. రెగ్యులర్ హారర్ కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందనే ఫీడ్ బ్యాక్ బయటికి రావడంతో ఈ జానర్ ఆడియన్స్ తో దీనికీ మంచి నెంబర్లు నమోదయ్యాయి. మొదటి రోజు బుక్ మై షోలో పాతిక వేల లోపే టికెట్లు అమ్ముడుపోతే సండేకి ఆ సంఖ్య 75 వేలు దాటడం అనూహ్యం. ఇక జపాన్ మూవీ డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ సైతం వీటికే మాత్రం తీసిపోని రీతిలో తక్కువ స్క్రీన్లలో ఉన్నా సరే కలెక్షన్ల పరంగా గట్టి పోటీ ఇచ్చింది. ఇక లిటిల్ హార్ట్స్ కూడా దున్నేసింది.

మూడో వారంలోకి అడిగి పెట్టక ముందే ముప్పై కోట్ల మార్కు దగ్గరగా వెళ్ళిపోయిన లిటిల్ హార్ట్స్ నిన్న మళ్ళీ ఊపందుకుంది. ఇక అన్ని సినిమాలకు అసలైన పరీక్ష ఇవాళ్టి నుంచి మొదలయ్యింది. మిరాయ్ ఇంత వీక్ డేలోనూ గంటకు సగటు 5 నుంచి 6 వేల టికెట్ల మధ్యలో అమ్మకాలు చేయడం ఒకరకంగా సెన్సేషనే. కిష్కిందపురి 1800 టికెట్లతో ట్రెండింగ్ లో కొనసాగడం హిట్టు దిశగా తీసుకెళ్తోంది. లిటిల్ హార్ట్స్ గత ఇరవై నాలుగు గంటల్లో 34 వేలకు పైగా టికెట్లు అమ్మింది. కొత్త లోక తెలుగు వెర్షన్ ముగింపు దశకు వచ్చేసింది. చూస్తుంటే మండే పరీక్షలో మిరాయ్ డిస్టింక్షన్, కిష్కిందపురి ఫస్ట్ క్లాసులో పాసయ్యేలా ఉన్నాయి.

This post was last modified on September 15, 2025 12:39 pm

Share

Recent Posts

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

36 seconds ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

58 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

4 hours ago