ఓజి విడుదల ఇంకో తొమ్మిది రోజుల్లో ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉండేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలం పేరుతో మొదలుపెట్టిన ట్రెండ్ క్రమంగా వేరే దారిలో వెళ్లి నెగటివిటీ తెచ్చే రిస్క్ కనిపిస్తోంది. యుఎస్ కి చెందిన ఒక ఎన్ఆర్ఐ ఫస్ట్ షో టికెట్ ని అయిదు లక్షలకు పాడుకున్నాడట. మంచిదే. దీన్ని జనసేనకు విరాళంగా ఇచ్చారు. ఇంకా సంతోషం. హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్ టికెట్ కోసం ట్విట్టర్ స్పేస్ లో వేలం పెట్టి లక్షకు అమ్మారట. దీని ఉద్దేశం కూడా డొనేషనే. తాజాగా తెనాలిలో యాభై వేల నుంచి పాట మొదలుపెట్టి అమ్మకం చేసే ఆలోచనలో ఉన్నారట.
వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన కోణం మరొకటి ఉంది. ఇలా ఒక్కో ఊరిలో ప్రీమియర్ ఫస్ట్ టికెట్ పేరుతో వేలాలు నిర్వహించుకుంటూ పోతే రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది కలగొచ్చు. ప్రత్యర్థులు దీన్నో అస్త్రంగా వాడుకుని సినిమా టికెట్ల వేలాన్ని తమ అనుకూల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. నిజంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే నేరుగా జనసేనకే ఇచ్చి పవన్ తో ఫోటో దిగితే అయిపోతుంది. దానికి ఓజిని వాడుకోవడం మిస్ ఫైరయ్యే ఛాన్స్ లేకపోలేదు. సోషల్ మీడియాలో టాపిక్ గా నిలవడం కోసం ఇలాంటివి చేస్తున్నారనే కామెంట్స్ లేకపోలేదు.
అసలేం చేయకపోయినా ఓజికి అవసరానికి మించిన బజ్ ఇప్పటికే ఉంది. దాన్ని ఋజువు చేయడం కోసం ఒక్కో ఏరియా మెల్లగా ఇలా టికెట్ వేలం పెట్టుకుంటూపోవడం ఏమిటనే పాయింట్ తలెత్తుతుంది. ఆ మాటకొస్తే ఇది లీగల్ గానూ కరెక్ట్ కాదు. అందుకే ఒకటికి పదిసార్లు అలోచించి అడుగులు వేయడం బెటర్. ఇంకా స్పెషల్ షోలకు సంబంధించి అనుమతులు రాలేదు. హరిహర వీరమల్లుకి వచ్చాయి కాబట్టి ఓజికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కాకపోతే వాటికి టికెట్ రేట్లు ఎంత పెడతారనేది అసలు ప్రశ్న. ఇంకో నాలుగైదు రోజుల్లో ట్రైలర్ తో పాటు వీటికి సమాధానం రాబోతోంది. చూద్దాం.
This post was last modified on September 15, 2025 11:17 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…