Movie News

55 కోట్లు… వసూళ్లు కాదు పాఠాలు

మిరాయ్ దూకుడు మాములుగా లేదు. వీకెండ్ ని యునానిమస్ గా డామినేట్ చేస్తోంది. ఏపీ తెలంగాణలో ఎక్స్ ట్రా షోలు, థియేటర్లతో టికెట్ల డిమాండ్ ని తట్టుకోవడానికి ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్లానింగ్ తో ఆదివారం చాలా బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ అధికారికంగా రెండు రోజుల వసూళ్లను 55 కోట్ల 60 లక్షలుగా ప్రకటించింది. హనుమాన్ ని దాటేయడానికి పరుగులు పెడుతున్న తేజ సజ్జ సోలో హీరోగా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మల్టీప్లెక్సులు, ప్రీమియం సింగల్ స్క్రీన్లలో మిరాయ్ టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా పరిస్థితి మారిపోయింది. వీకెండ్ సెకండ్ షోల దాకా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

వీటిని కేవలం వసూళ్లగానే కాకుండా పాఠాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచుకుంటే తప్ప గట్టెక్కలేమనే భ్రమలో ఉన్న టయర్ 2 నిర్మాతలకు ఇదో చెంపపెట్టు లెసన్ గా నిలుస్తోంది. అవకాశం పలుకుబడి ఉన్నా సరే టికెట్ హైక్స్ తీసుకోకుండా రెగ్యులర్ ధరలకే కట్టుబడి ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని అధిక శాతం వచ్చేలా చేస్తోంది. నిజంగానే మిరాయ్ కు పెంపు అడిగి ఉంటే వెంటనే వచ్చేసేది. ఇప్పుడున్న టాక్ కి జనాలు చూసేవాళ్ళు. కానీ వీకెండ్ కాగానే వెంటనే డ్రాప్ తీవ్రంగా ఉండే ప్రమాదం పొంచి ఉండేది. దాన్ని మిరాయ్ దిగ్విజయంగా తప్పించుకోవడం రేపటి నుంచి చూడొచ్చు.

కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చినప్పుడు ఎలాంటి పెంపులు, సవరణలు అక్కర్లేదని మిరాయ్ నిరూపించేసింది. మిగిలిన నిర్మాతలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ లేని చిన్న బడ్జెట్ సినిమాలు లిటిల్ హార్ట్స్ రూపంలో అద్భుతాలు చేసి చూపించాయి. విఎఫ్ఎక్స్ మీద ఆధారపడిన మిరాయ్ లాంటివి మాములు టికెట్ రేట్లతో ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. అలాంటప్పుడు ఇకపై ఈ విషయంలో ప్రొడ్యూసర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. జిఓలు వచ్చినంత సులభంగా కలెక్షన్లు రావని గుర్తు పెట్టుకుంటే చాలు.

This post was last modified on September 14, 2025 12:31 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Mirai

Recent Posts

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

1 hour ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

2 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

2 hours ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 hours ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

3 hours ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

5 hours ago