Movie News

కూలీని తిట్టిన ఆమిర్.. నిజ‌మా?

ఈ మధ్య కాలంలో అత్యంత హైప్‌తో రిలీజై.. ఆ హైప్‌ను కనీస స్థాయిలో కూడా మ్యాచ్ చేయలేని సినిమా అంటే ‘కూలీ’నే అని చెప్పాలి. ప్రోమోలతో ఏవేవో భ్రమలు కల్పించిన లోకేష్ కనకరాజ్.. తన కెరీర్లోనే అత్యంత అర్థరహితమైన కథాకథనాలతో తీవ్ర నిరాశకు గురి చేశాడు. కథలో.. సన్నివేశాల్లో ఏమాత్రం లాజిక్ లేకుండా సాగిన ఈ చిత్రంలో ఒక్కటంటే ఒక్క పాత్రతోనూ ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. బోలెడన్నిసార్లు నరేషన్ విని మరీ ఈ సినిమాకు సంతకం చేసిన నాగ్.. అసలేం చూసి సైమన్ పాత్రను ఓకే చేశాడన్నది అర్థం కాలేదు.

హీరో రజినీకాంత్, స్పెషల్ రోల్ చేసిన ఉపేంద్ర.. ఇలా అందరి పాత్రలూ అంతంతమాత్రమే. ఇక చివర్లో స్పెషల్ క్యామియో చేసిన ఆమిర్ పాత్ర అయితే ఈ సినిమాలో ఎందుకు ఉందో.. దాని పరమార్థమేంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు. ‘విక్రమ్’లో రోలెక్స్ రేంజ్ క్యారెక్టర్ అంటూ దీని గురించి బిల్డప్ ఇచ్చారు. కానీ అందులో పదో శాతం ఇంపాక్ట్ కూడా వేయలేకపోయిందా పాత్ర.

ఐతే ప్రేక్షకులు ఈ పాత్ర గురించి విమర్శించడం కాదు.. స్వయంగా ఆమిర్ ఖానే అదొక వేస్ట్ క్యారెక్టర్ అని తేల్చేసిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రజినీకాంత్ సినిమా కావడంతో కథ, తన పాత్ర గురించి ఏమీ వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నట్లు ఆమిర్ ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఆ విష‌యమే చెబుతూ.. అస‌లు త‌న పాత్ర సినిమాలో ఎందుకుందో అర్థం కాలేద‌ని.. ఆ పాత్ర‌కు ఏ ప‌ర్ప‌స్ లేద‌ని.. కూలీ సినిమా చేయ‌డం పెద్ద త‌ప్పు అని ఆమిర్ అన్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

దీనికి సంబంధించి ఒక న్యూస్ క్లిప్పింగ్ కూడా వైర‌ల్ అవుతోంది. ఈ కామెంట్లు చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో అంద‌రూ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌ను మ‌రో రౌండ్ ఆడుకుంటున్నారు. కానీ ఈ న్యూస్ ఫేక్ అంటూ అమీర్ ఖాన్ పర్సనల్ టీం వివ‌ర‌ణ ఇచ్చింది. ఆమిర్ ఎక్క‌డా కూలీలో త‌న పాత్ర గురించి మాట్లాడ‌లేద‌ని.. సినిమా మీద విమ‌ర్శ‌లు గుప్పించ‌లేద‌ని.. ఈ ఫేక్ న్యూస్‌ను న‌మ్మొద్ద‌ని అతని టీం స్ప‌ష్టం చేసింది. ఐతే ఆమిర్ ఆ కామెంట్లు చేయ‌క‌పోయినా.. ఆయ‌న అలా అన‌ద‌గ్గ స్థాయి పాత్రే త‌న‌ది అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

This post was last modified on September 13, 2025 9:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

37 minutes ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

56 minutes ago

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

1 hour ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

2 hours ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

4 hours ago

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

4 hours ago