హీరోలు విలన్లుగా మారడం అంత ఈజీ కాదు. ఒక్కోసారి ఆడియన్స్ రిసీవ్ చేసుకోకపోవచ్చు. జగపతిబాబుని బ్రహ్మాండంగా ఆదరించిన ప్రేక్షకులే శ్రీకాంత్ ని అంతే స్థాయిలో నెగటివ్ షేడ్ లో చూడలేకపోయారు. కూలీలో నాగార్జునకీ ఈ పరిస్థితి తలెత్తింది. కాకపోతే ఒకప్పుడు విలన్ గా ఉండి తర్వాత హీరోగా మారి మళ్ళీ విలన్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ మధ్యలో ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడిగా మెప్పించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీతో హీరోగా మొదలుపెట్టి తిరుగులేని స్టార్ డం సంపాదించుకుని కొన్నేళ్ల పాటు టయర్ 1 స్టార్లకు పెద్ద పోటీ ఇచ్చారు.
తర్వాత ఫ్లాపుల వల్ల తెరమీద కనిపించడం తగ్గించేసిన మోహన్ బాబు అప్పుడప్పుడు తనకు కథలు నచ్చితే తప్ప మేకప్ వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. కన్నప్పలో మెప్పించిన ఈ విలక్షణ నటుడు త్వరలో నాని ప్యారడైజ్ లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయబోతున్నారనే లీక్ నెలల క్రితమే వచ్చింది. నిర్మాణ సంస్థ, దర్శకుడు అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయిన న్యూసే ఇది. ఒకవేళ నిజమైతే మాత్రం రౌడీ తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ లో మోహన్ బాబుని చూడొచ్చు. అయితే తండ్రి కన్నా ముందు కొడుకు మంచు మనోజ్ విలన్ పాత్రలకు మంచి ఛాయస్ గా మారుతున్నాడు.
భైరవంలో తొలిసారి విలన్ గా ట్రై చేసిన మనోజ్ కు దాని బాక్సాఫీస్ ఫలితం అంత ఆశాజనకంగా రాలేదు కానీ తాజాగా మిరాయ్ రూపంలో జాక్ పాట్ కొట్టినట్టే ఉన్నాడు. స్క్రీన్ స్పేస్ మరీ ఎక్కువగా దొరకనప్పటికీ ఉన్నంతలో తన విలనీని చూపించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. అందుకే ఇకపై పాత్ర ఛాలెంజింగ్ గా అనిపిస్తే ఇదే తరహా కొనసాగించే ఆలోచనలో మనోజ్ ఉన్నాడు. మిరాయ్ లో గెటప్, బిల్డప్ అన్నీ బాగా కుదిరాయి. ఇంకొంచెం ఎక్కువ వాడుకోవాల్సిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. భవిష్యత్తులో మనోజ్, మోహన్ బాబు ఇలా వరస సినిమాల్లో చూడటం కన్నా మంచు ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on September 12, 2025 5:49 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…