టాలీవుడ్ బాక్సాఫీస్ ఇవాళ మంచి హుషారుగా ఉంది. గత వారం లిటిల్ హార్ట్స్ ఘనవిజయం సాధించినా ఘాటీ, మదరాసిలు కనీస స్థాయిలో ఆడకపోవడంతో అవి వేసుకున్న థియేటర్లు కళతప్పి షోలు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి తలెత్తింది. అందుకే కొత్తగా వచ్చిన రిలీజుల మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పబ్లిక్ టాక్స్, ఫైనల్ స్టేటస్ లు తర్వాత తేలుతాయి కానీ మిరాయ్, కిష్కిందపురిలతో హాళ్లు జనంతో నిండిపోయి కళకళలాడుతూ కనిపించాయి. ముందు హైదరాబాద్ కే పరిమితమనుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాకు నిన్న రాత్రి అప్పటికప్పుడు షోలు యాడ్ చేసినా దాదాపు అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.
ఇక ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ మోసుకొచ్చిన మిరాయ్ మాములుగా దుమ్ము దులపడం లేదు. మూసాపేట్ శ్రీరాములు నుంచి ఓవర్సీస్ ప్రీమియర్స్ దాకా పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్ కదిలి వస్తున్న తీరు వీకెండ్ డామినేషన్ ఎవరిదో స్పష్టం చేస్తున్నాయి. ఇదే టాక్ కనక మిరాయ్ నిలబెట్టుకుంటే ఆదివారం లోపే సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. తర్వాత కొంచెం డ్రాప్ ఉన్నా కూడా హోల్డ్ కొనసాగుతోంది. సోషల్ మీడియా మొత్తం మిరాయ్ గురించిన ట్వీట్లు, పోస్టులతో ఫుల్ అయిపోయింది. టైంలైన్ ఓపెన్ చేస్తే ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి.
ఈ రెండు పక్కనపెడితే జాపనీస్ మూవీ డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ కు అద్భుతమైన స్పందన దక్కింది. పరిమితంగా షోలు వేస్తే ఆన్ లైన్లోనే అవి ఫుల్ కావడంతో అదనంగా జోడించాల్సి వచ్చింది. క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం ప్రాంగణంలో ఈ మూవీ కటవుట్లు పెట్టే స్థాయిలో క్రేజ్ ఉందంటే దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక లిటిల్ హార్ట్స్ రెండో వారంలోనూ జోరు కొనసాగిస్తోంది. మెయిన్ థియేటర్లు కంటిన్యూ చేస్తున్నారు. ఇతర భాషల్లో ఏమో కానీ ఏపీ తెలంగాణలో మాత్రం థియేటర్లు జనంతో నిండిపోవడం చూసి మూవీ లవర్స్, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అందరూ ఆహా ఏమి ఈ దృశ్యం అనుకుంటున్నారు.
This post was last modified on September 12, 2025 2:26 pm
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…