రేపు విడుదల కాబోతున్న మిరాయ్ మీద ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయని బుక్ మై షో ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. సగటున గంటకు 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతుండగా కాంపిటీషన్ లో ఉన్న కిష్కిందపురి గంటకు వెయ్యి టికెట్లతో మెల్లగా రేసులో తోడవుతోంది. విచిత్రంగా జపాన్ మూవీ డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ ఊహించని విధంగా మన సినిమాలతో పోటీ పడుతూ గంటకు అయిదు వేలకు పైగా టికెట్లతో వసూళ్లను కవ్విస్తోంది. చాలా నగరాల్లో ఉదయం 5 గంటలకు షోలు వేస్తున్నా హౌస్ ఫుల్స్ కావడం గమనార్హం. డబ్బింగ్ కన్నా ఒరిజినల్ వెర్షన్ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపడం ఇంకో ట్విస్ట్.
ఇప్పుడు జరుగుతున్న పాజిటివ్ ట్రెండ్స్ ని తనకు అనుకూలంగా మార్చుకోవడం మిరాయ్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మంచి వీకెండ్ దొరికింది. సెకండ్ సాటర్డే సెలవు రోజు కావడంతో వరసగా శని ఆదివారాలు థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేయొచ్చు. ఏపీ తెలంగాణలో చాలా చోట్ల ఉదయం 7 గంటల నుంచే మిరాయ్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. కిష్కిందపురి లాగా ముందు రోజే షోలు వేయకపోయినా రెగ్యులర్ ఆటలు అందులోనూ టికెట్ ధరలు పెంచకుండా పీపుల్స్ మీడియా తీసుకున్న నిర్ణయం మంచి ఫలితం ఇచ్చేలా ఉంది. బుకింగ్ యాప్స్ లో అదే స్పష్టమవుతోంది.
దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని బ్రాండ్ కన్నా కంటెంట్ లో ఉన్న ఫాంటసీ ఎలిమెంట్, విఎఫెక్స్ ఎఫెక్ట్, ట్రైలర్ ఇంపాక్ట్ ఇవన్నీ కలిసి మిరాయ్ మీద హైప్ తీసుకొచ్చాయి. వైబ్ ఉంది పాట బాగా రీచ్ కావడం మరో ప్లస్ గా మారింది. అంతు చిక్కని ప్రపంచంలో సాహసాలు చేసే యువకుడిగా తేజ సజ్జ చేయబోయే అడ్వెంచర్ల కోసం ఈసారి స్కూల్ పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయి. మిరాయ్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఓజి వచ్చాక కూడా వీలైనన్ని థియేటర్లను హోల్డ్ చేసుకుని తద్వారా చైల్డ్ ఆడియన్స్ ని మూడో వారంలో థియేటర్లకు లాగొచ్చు. టాక్ రావడమే ఇక బాకీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates