Movie News

ఫ్యాన్ వార్స్‌ను కెరీర్ కోసం వాడేసుక‌న్న డైరెక్ట‌ర్

లిటిల్ హార్ట్స్ సినిమాతో టాలీవుడ్లో సంచ‌లనం రేపుతున్నాడు యువ ద‌ర్శ‌కుడు సాయి మార్తాండ్. ద‌ర్శ‌కుడిగా అతడికిదే తొలి చిత్రం. సింపుల్ క‌థ‌ను తీసుకుని ఆద్యంతం వినోదాత్మ‌కంగా న‌డిపించిన తీరు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. యువ ప్రేక్ష‌కులు అత‌డి న‌రేష‌న్‌కు ఫిదా అయిపోయారు. సాయి మార్తాండ్ కొన్నేళ్ల ముందు మీమ‌ర్ కావ‌డం విశేషం.

మీమ్స్ అనుభ‌వం సినిమాలో ప్ర‌తి స‌న్నివేశంలోనూ కామెడీ పండించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డింది. సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకునే అత‌ను ఎదిగాడు. ఇక ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు వెతుక్కోవ‌డానికి కూడా త‌న‌కు సోష‌ల్ మీడియానే సాయ‌ప‌డింద‌ని అత‌ను ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఫ్యాన్ వార్స్‌ను సైతం తాను కెరీర్ కోసం ఉప‌యోగించుకున్న‌ట్లు సాయి మార్తాండ్ వెల్ల‌డించాడు.

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్టు అయిన పొన్నియ‌న్ సెల్వ‌న్ త‌మిళంలో బాగా ఆడినా, తెలుగులో మిక్స్‌డ్  రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాను ఇష్ట‌ప‌డేవాళ్లు, న‌చ్చ‌ని వాళ్లు రెండు వ‌ర్గాలుగా త‌యార‌య్యార‌ని.. వీళ్ల మ‌ధ్య ఫ్యాన్ వార్స్ జ‌రిగేవ‌ని… హేట‌ర్స్ బ్యాచ్‌లో తాను కూడా ఒక‌డిన‌ని సాయి మార్తాండ్ వెల్ల‌డించాడు.

బాహుబ‌లి న‌చ్చి, పొన్నియ‌న్ సెల్వ‌న్‌ను ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు ఆ గ్రూప్‌లో ఉంటార‌ని.. దీన్నుంచే తాను ఇండస్ట్రీలో అనేక‌మంది కాంటాక్ట్స్ సంపాదించాన‌ని మార్తాండ్ తెలిపాడు. ఈ గ్రూప్‌లో వాళ్లు చేప‌ట్టిన ఒక స్పేస్‌కు ఒక పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కు చెందిన మార్కెటింగ్ హెడ్ ఒక‌సారి వ‌చ్చారని.. ఆ స్పేస్‌లో ఓ వ్య‌క్తి త‌న గురించి చాలా పాజిటివ్‌గా చెప్ప‌డంతో ఆ మార్కెటింగ్ హెడ్ ద్వారా ప్రొడ‌క్షన్ హౌస్ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ను క‌లిసే అవ‌కాశం ల‌భించింద‌ని మార్తాండ్ తెలిపాడు. ఇలా సోష‌ల్ మీడియాను త‌న కెరీర్ కోసం బాగానే ఉప‌యోగించుకున్నాన‌ని.. దాని వ‌ల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాన‌ని సాయి మార్తాండ్ తెలిపాడు.

This post was last modified on September 10, 2025 9:41 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sai Marthand

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago