బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్‌ను త్వరలోనే కొత్త అవతారంలో చూడబోతున్నాం. పాతికేళ్ల కెరీర్లో హీరోగానే కనిపించిన అతను.. తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. తాను హీరోగా, తన తండ్రి దర్శక నిర్మాతగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘క్రిష్’ ఫ్రాంఛైజీలో భాగంగా నాలుగో చిత్రాన్ని స్వయంగా హృతికే డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ ఫ్రాంఛైజీలో తొలి మూడు చిత్రాలు కోయీ మిల్‌గయా, క్రిష్, క్రిష్-3 ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. వీటిని డైరెక్ట్ చేసిన రాకేష్ రోషన్ చాలా ఏళ్ల కిందటే క్రిష్-4కు స్క్రిప్టు రెడీ చేశాడు. కానీ ఒకవైపు బడ్జెట్ సమస్యలు, మరోవైపు రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
హృతిక్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టాల్సి రావడంతో నిధులు సమకూరలేదు. బడ్జెట్ తగ్గిస్తే సినిమా చెడిపోతుందని రాకేష్ రాజీ పడలేదు. ఈలోపు ఆయనకు వయసు పెరిగి, ఓపిక తగ్గిపోయింది. దీంతో తాను ఆ సినిమాను డైరెక్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. హృతిక్‌కే బాధ్యతలు అప్పగించేశాడు. ఐతే ప్రి ప్రొడక్షన్ ఆలస్యం, ఫైనాన్స్ సమకూర్చుకోవడంలో ఇబ్బందులతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు అన్ని అడ్డంకులూ తొలగిపోయినట్లే ఉన్నాయి. క్రిష్-4 బడ్జెట్‌పై పూర్తి అవగాహన తెచ్చుకున్నామని, అన్ని లెక్కలూ వేసుకుని ప్రి ప్రొడక్షన్ పనులూ మొదలుపెట్టామని రాకేష్ రోషన్ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని.. 2027లో రిలీజ్ ఉంటుందని కూడా రాకేష్ రోషన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. ఆ తర్వాత ‘క్రిష్-4’కు అంకితం కానున్నాడు హృతిక్.
This post was last modified on September 9, 2025 6:06 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…