ఒక దశలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి సూపర్ హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు శర్వానంద్. అతడి మార్కెట్ అమాంతం పెరిగింది. కానీ ఆ సక్సెస్ స్ట్రీక్‌ను తర్వాత కొనసాగించలేకపోయాడు. మారుతితో చేసిన ‘మహానుభావుడు’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో శర్వా స్థాయికి తగ్గ విజయాల్లేవు.
చివరగా అతడి నుంచి వచ్చిన జాను, పడి పడి లేచె మనసు పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు శర్వాకు అత్యవసరంగా ఓ హిట్టు అవసరం. ఆ విజయం ఏది అందిస్తుందో కానీ.. శర్వా మాత్రం యమ స్పీడుగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇప్పటికే శర్వా తెలుగులో ‘శ్రీకారం’ అనే సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం మొదలైంది గత ఏడాదే కానీ.. మధ్యలో కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది.
ఇక శర్వా లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన ఓ కొత్త చిత్రం ఇంతలోనే పూర్తయిపోవడం విశేషం. తమిళంలో నిర్మాతగా చాలా మంచి పేరున్న ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్స్’ బేనర్ మీద తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇంతకుముందు శర్వా తమిళంలో ‘జర్నీ’ సినిమాతో చాలా మంచి పేరే సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆ మార్కెట్ మీద దృష్టిపెట్టలేదు. ఇంత కాలానికి ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.
ఈ సినిమాలో సీనియర్ నటి అమల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. వీళ్లిద్దరికీ తమిళంలో మంచి గుర్తింపే ఉంది. తెలుగు వెర్షన్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలు రాస్తున్నది దర్శకుడు తరుణ్ భాస్కర్ కావడం విశేషం. కొత్త ఏడాదిలో వీలు చూసుకుని ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
This post was last modified on November 24, 2020 2:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…