మాములుగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయించుకోవడమే గగనమైపోయింది. అలాంటిది రెండున్నర నెలల్లో రెండు సినిమాలు విడుదలంటే అసలు ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ రవితేజకది జరిగేలా ఉంది. ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఆలస్యమవుతూ వచ్చిన మాస్ జాతర అక్టోబర్ 31 దాదాపు లాక్ చేసుకున్నట్టే. బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ తప్ప ఆ రోజు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. పండగ సీజన్ కాకపోయినా టాక్ బాగుంటే కమర్షియల్ ఫుల్ బాగా ఉండే టైం కనక నిర్మాత నాగవంశీ ధీమాగా ఉన్నారట. ప్రకటన రాలేదు కానీ ఫైనల్ చేసే చర్చలు చివరి దశలో ఉన్నాయని టాక్.
మాస్ జాతర మీద ఇప్పటికైతే బజ్ పెద్దగా లేదు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్. ధమాకా మేజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. ముందు అనార్కలి టైటిల్ అనుకున్నారు కానీ ప్రస్తుతం దానికి బదులు మరో వెరైటీ పేరు పెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా రవితేజకు పెట్టని టైటిల్ సెట్ చేయబోతున్నట్టు తెలిసింది.
పండక్కు ఎంత పోటీ ఉన్నా సరే జనవరి 13 ఈ మూవీని రిలీజ్ చేయాలని సంకల్పించుకున్నారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నిజమైతే మాత్రం ఇంత తక్కువ గ్యాప్ లో మాస్ మహారాజా సినిమాలు ఎంజాయ్ చేయడం అభిమానులకు స్పెషల్ గా ఉండిపోతుంది. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే స్పీడ్ విషయంలో రవితేజ ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. కాకపోతే దర్శకులు సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మాస్ జాతర, తిరుమల కిషోర్ సినిమాలు హిట్టయ్యి మళ్ళీ తనను ట్రాక్ లోకి తీసుకురావడం కోసమే సినీ ప్రియులు వెయిటింగ్.
This post was last modified on September 8, 2025 11:15 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…