ఇమేజ్ ఉన్న హీరోలు, కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాలు సోలో రిలీజ్ కావాలని కోరుకోవడం తప్పు కాదు. అందుకే ముందస్తు ప్లానింగ్ వేసుకుని మరీ డేట్లు ప్రకటించుకుని దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటారు. కిష్కిందపురి టీమ్ ఆ పనే చేసింది. సెప్టెంబర్ 12 ఎప్పుడో లాక్ చేసుకుని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. సెప్టెంబర్ 5 ఎలాగూ మిరాయ్ వస్తుంది కాబట్టి వారం గ్యాప్ సరిపోతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకుంది. తీరా చూస్తే మిరాయ్ హఠాత్తుగా సెప్టెంబర్ 12కి వచ్చేయడంతో బెల్లకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జల మధ్య క్లాష్ తప్పడం లేదు. ఓపెనింగ్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది.
అయితే డేట్ మారాలని నిర్ణయించుకున్నప్పుడు తమకు కర్టసీగా కనీసం చెప్పకుండా ప్రకటన ఇచ్చేశారని మిరాయ్ టీమ్ మీద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటర్వ్యూలలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికా ఆవేదనలో న్యాయముంది. కానీ మిరాయ్ సెప్టెంబర్ 12 వదులుకుంటే చాలా రిస్క్ లో పడుతుందనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే సెప్టెంబర్ 25 ఓజి దిగుతుంది. పవన్ కళ్యాణ్ పెంచుతున్న హైప్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల థియేటర్లన్నీ దాని నామస్మరణలో మునిగి తేలేలా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకునే మిరాయ్ బృందం సెప్టెంబర్ 19 కాకుండా సెప్టెంబర్ 12 వేసుకుంది.
న్యాయంగా చూసుకుంటే కిష్కిందపురి వైపే ఎడ్జ్ ఉంటుంది కానీ ఇప్పుడీ పోటీ వల్ల వసూళ్లు ఎఫెక్ట్ కావడాన్ని ఎవరూ కాదనలేరు. హారర్ జానర్ లో రూపొందిన సాయిశ్రీనివాస్ మూవీకి టార్గెట్ ఆడియన్స్ పరిమితంగా ఉంటారు. అందుకే ఒంటరిగా వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. మిరాయ్ అన్ని వర్గాలను లక్ష్యంగా పెట్టుకొవడంతో పాటు ఫాంటసీ జానర్ కనక ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటుంది. చివరిగా గెలిచేది కంటెంటే కాబట్టి ఫైనల్ విన్నర్ ని తేల్చేది అదే. ఘాటీ, మదరాసిలు నిరాశపరిచి లిటిల్ హార్ట్స్ ఒకటే ఈ వారం విజేతగా నిలవడంతో నెక్స్ట్ వీక్ బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది.
This post was last modified on September 8, 2025 11:09 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…