సినీ రంగంలో స్టార్ హీరోలు చాలా వరకు ఎవరికి వారే అన్నట్లుంటారు. ఏ ఇగోలు లేకుండా మంచి స్నేహితుల్లా సాగే స్టార్లు అరుదుగా కనిపిస్తారు. ఇక ఇండస్ట్రీలో అగ్రస్థానం కోసం పోటీ పడే హీరోల మధ్య స్నేహం అంటే మరీ అరుదు. కానీ తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ దశాబ్దాలుగా తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా కూడా చేయబోతున్నారు. మరోవైపు మలయాళంలోనూ ఇద్దరూ టాప్ హీరోల మధ్య గొప్ప స్నేహం ఉంది. వాళ్లే.. మోహన్ లాల్, మమ్ముట్టి. వీరి అభిమానులు హిట్లు, కలెక్షన్లు, రికార్డుల గురించి బయట, సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. ఆ ఇద్దరూ మాత్రం ఎంతో ఆత్మీయంగా మెలుగుతారు.
ఒకరితో ఒకరికి పోటీ లేదు. అసూయకు అసలే అవకాశం లేదు. ఈ మధ్య మమ్ముట్టి అనారోగ్యం పాలైతే.. శబరిమలకు వెళ్లి తన మిత్రుడి కోసం ప్రత్యేకంగా మోహన్ లాల్ పూజలు చేయించడం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి తన స్నేహితుడి మీద తన ప్రేమను చాటాడు మోహన్ లాల్.
ఆదివారం మమ్ముట్టి 74వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఎప్పట్లాగే ఏ హడావుడి లేకుండా ఆయన బర్త్ డే జరిగిపోయింది. ఆయన బయటికి కూడా రాలేదు. ఐతే అదే సమయంలో మలయాళ బిగ్ బాస్ షోకు హోస్ట్ అయిన మోహన్ లాల్ వెరైటీగా తయారై వచ్చారు.
ఆయన వేసుకున్న షర్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ చొక్కా మొత్తం మమ్ముట్టి బొమ్మలతో నిండిపోయింది. మమ్ముట్టి ఐకానిక్ సినిమాలు, క్యారెక్టర్లతో ఆ చొక్కాను డిజైన్ చేశారు. ఒక టాప్ స్టార్.. ఇంకో టాప్ స్టార్ బొమ్మలతో ఉన్న చొక్కా తొడుక్కుని ఇలా ఒక షోను హోస్ట్ చేయడం అరుదైన విషయం. మలయాళంలో ఎప్పట్నుంచో నంబర్ వన్‌గా కొనసాగుతున్న మోహన్ లాల్.. ఏమాత్రం బేషజం లేకుండా తన మిత్రుడైన మరో టాప్ స్టార్ మీద ప్రేమతో ఇలా చేయడం ప్రశంసలు అందుకుంటోంది. హీరోలందరికీ ఇది ఆదర్శం అంటూ ఆయన్ని కొనియాడుతున్నారు నెటిజన్లు.
This post was last modified on September 8, 2025 8:22 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…