Movie News

9 సంవత్సరాల నాటి క్రిష్ కావాలి

దర్శకుడు క్రిష్ అంటే మూవీ లవర్స్ లో ప్రత్యేక గౌరవముంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలతో ఆలోచింపజేసే సినిమాలు తీస్తాడని ఎక్కువగా ఇష్టపడతారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ కు ఇప్పటికీ బోలెడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్ర 2015లో వచ్చిన కంచెతోనూ కొనసాగింది. 2017లో గౌతమిపుత్రశాతకర్ణితో బాలకృష్ణకు మర్చిపోలేని వందో మూవీ ఇచ్చిన క్రిష్ ఆ తర్వాత ట్రాక్ తప్పారు. మణికర్ణిక నుంచి మధ్యలోనే బయటికి వచ్చేయడంతో కంగనా రౌనత్ తో పాటు డైరెక్షన్ కార్డుని పంచుకోవాల్సి వచ్చింది. అది యావరేజ్ కావడం వేరే విషయం.

బాలయ్య ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండూ తీవ్రంగా నిరాశపరిచాయి. స్వర్గీయ ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన ఎంత అద్భుతంగా ఉన్నా మహానటి టైపు ట్రీట్ మెంట్ రాసుకున్న క్రిష్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయారు. కొండపొలం సంగతి సరేసరి. చదవడానికి గొప్పగా అనిపించే నవలను తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటుతో పాటు ఇంత హెవీ సబ్జెక్టుకి వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టడం ఆడియన్స్ తిరస్కారానికి కారణమయ్యింది. ఇక హరిహర వీరమల్లు గురించి తెలిసిందే. డిజాస్టర్ లో జ్యోతికృష్ణదే సింహ భాగమైనా క్రిష్ ప్రమేయాన్ని కొట్టి పారేయలేం.

ఇప్పుడు ఘాటీ కూడా వీటి కోవలోకే చేరింది. తన సెన్సిబిలిటీకి ఏ మాత్రం సూటవ్వని గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న క్రిష్ దాన్ని కనీసం యావరేజ్ అనిపించే స్థాయిలో తీయలేకపోయారు. అనుష్క విశ్వరూపం చూస్తారని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు కానీ తన దర్శకత్వపు విశ్వరూపం కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారని మర్చిపోయారు. పుష్ప, కెజిఎఫ్ ప్రభావంతో అలాంటి ట్రీట్ మెంట్ తోనే ఒక లేడీ గ్యాంగ్ స్టర్ కథను చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. బాలయ్య డ్రీం ప్రాజెక్టు ఆదిత్య 999 మ్యాక్స్ ని క్రిష్ కి ఇవ్వబోతున్నారనే టాక్ బలంగా ఉంది. దాన్నుంచి క్రిష్ సత్తా బయటపడాలనేది సినీ ప్రియుల కోరిక.

This post was last modified on September 7, 2025 9:03 pm

Share
Show comments
Published by
Kumar
Tags: GhaatiKrish

Recent Posts

‘చంద్రబాబును తిట్టలేదు.. అరెస్ట్ చేస్తే చేసుకోండి’

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…

14 minutes ago

టాలీవుడ్… వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేసిన క్రేజీ మూవీస్

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ సృష్టించిన…

21 minutes ago

గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్…

2 hours ago

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…

3 hours ago

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

3 hours ago

ప్రమోషన్లలో మోసపోతున్న యంగ్ హీరో

తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…

4 hours ago