Movie News

ఘాటీ… ఇలా జరిగింది ఏమిటి

రెండేళ్ల తర్వాత అనుష్క సినిమా వస్తోందంటే ఆడియన్స్ లో ప్రత్యేక అంచనాలు నెలకొంటాయి. అరుంధతి నుంచి బాహుబలి దాకా తనకంటూ స్వంత ఫాలోయింగ్ సంపాదించుకున్న స్వీటీ టాలీవుడ్ లో విజయశాంతి తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ మార్కెట్ ఏర్పరుచుకుందనే రేంజ్ లో ఒకప్పుడు కథనాలు వచ్చాయి. ఇదంతా సైజ్ జీరో రిలీజ్ కు ముందు కథ. ఆ మూవీ కోసం బరువు తగ్గించుకుని మళ్ళీ పెరిగి ఫిజికల్ గా చాలా ఇబ్బంది పడిన అనుష్క అప్పటి నుంచి బయట కనిపించడం తగ్గించేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఘాటీ ప్రమోషన్లకు కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు.

ఇప్పుడు ఘాటీ ఫలితం మొదటి రోజే తేలిపోయింది. ఆదివారం సెలవు రోజే అయినా కనీస స్థాయిలో ఆక్యుపెన్సీలు లేకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. కథా కథనాలు కనీస స్థాయిలో ఆకట్టుకునేలా లేకపోవడంతో పాటు గంజాయి బ్యాక్ డ్రాప్ ని పెట్టుకుని రొటీన్ కంటెంట్ ని దర్శకుడు క్రిష్ చూపించిన విధానం ఆడియన్స్ ని ఎంత మాత్రం మెప్పించలేకపోయింది. సిచువేషన్ ఎలా ఉందంటే ఘాటీ కోసం అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు పెద్దగా ఆలోచన చేయకుండా లిటిల్ హార్ట్స్ కు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. చాలా బిసి సెంటర్లలో ఇలా చేయక తప్పలేదని ట్రేడ్ నుంచి వినిపిస్తున్న మాట.

డిజాస్టర్లు అందరికీ వస్తాయి కానీ ఒక ఇమేజ్ ఉన్న స్టార్ కి ఓపెనింగ్స్ కూడా దక్కలేదంటే తప్పు ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. వీడియోలో కనిపించకుండా కేవలం ఆడియో రూపంలో అనుష్క చేసిన ప్రమోషన్లు బెడిసి కొట్టాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సహకారం అందించినా అవి జనాలను చేరలేదు. మనిషి ఎదురుగా కనిపించి సినిమా చూడమని వేడుకుంటేనే ప్రేక్షకులు కరగలేని ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది నా గొంతు విని టికెట్లు కోనేయండి అంటే ఎలా పనవుతుంది. అనుష్క నెక్స్ట్ రిలీజ్ కథనర్ పబ్లిసిటీకైనా స్వీటీ డైరెక్ట్ దర్శనం జరుగుతుందో లేదో చూడాలి.

This post was last modified on September 7, 2025 8:43 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago