ఒకప్పుడు తమిళ సినిమాల క్వాలిటీనే వేరుగా ఉండేది. మార్కెట్ పరంగా రేంజ్ తక్కువ కావచ్చు కానీ.. కంటెంట్ క్వాలిటీ మాత్రం ఇండియాలో ఏ ఇండస్ట్రీకి తీసిపోని స్థాయిలో అక్కడి సినిమాలుండేవి. అక్కడ అనేక ప్రయోగాలు జరిగేవి. కమర్షియల్ సినిమాల్లోనూ వైవిధ్యం చూపించేవాళ్లు. రొటీన్ సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ గత దశాబ్ద కాలంలో మొత్తం మారిపోయింది. తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయింది. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు అందించిన శంకర్, మణిరత్నం, మురుగదాస్ లాంటి దర్శకుల నుంచి పేలవమైన సినిమాలు వస్తున్నాయి.
మురుగదాస్ సంగతే తీసుకుంటే.. ‘స్పైడర్’ దగ్గర్నుంచి ఆయన వరుసగా డిజాస్టర్లు డెలివర్ చేస్తున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్లో ఆల్రెడీ ‘సికందర్’ సినిమాతో షాక్ తిన్నాడు మురుగదాస్. తమిళంలో తీసిన ‘మదరాసి’తో ఆయన పుంజుకుంటాడేమో అని అభిమానులు ఆశించారు. ఐతే ఈ సినిమాకు కూడా డివైడ్ టాక్ తప్పలేదు.
మురుగదాస్ గత చిత్రాలతో పోలిస్తే కొంచెం బెటర్ అనే టాక్ వచ్చింది తప్ప.. ఓవరాల్‌గా ఇది మెప్పించే సినిమా అయితే కాదు. విపరీతమైన సాగతీత.. యాక్షన్ ఎపిసోడ్లు తప్ప విషయం లేని బోరింగ్ సెకండాఫ్ సినిమాకు పెద్ద మైనస్ అయింది. తెలుగులో ఈ సినిమాకు ఆరంభం నుంచి ఆశించిన వసూళ్లు లేవు. రెండో రోజు సినిమా మరింత వీక్ అయింది. ఇక్కడ ‘మదరాసి’ ఫ్లాప్ అని తేలిపోయింది. కానీ తమిళంలో మాత్రం ‘మదరాసి’ వీకెండ్లో బాగా ఆడుతోంది. శుక్ర, శనివారాల్లో ఈ చిత్రం తమిళంలో మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. ఆదివారం కూడా చెన్నై సహా మేజర్ సిటీస్‌లో ‘మదరాసి’ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది.
గత కొన్నేళ్లలో తమిళంలో టాప్ స్టార్లు నటించిన రొటీన్ మాస్ మసాలా సినిమాలు తమిళంలో బాగా ఆడాయి. విజయ్ చిత్రాల్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, లియో, వారిసు.. ఇవేవీ చెప్పుకోదగ్గ చిత్రాలు కాదు. కానీ బాగా ఆడాయి. అజిత్ చిత్రాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ, వలిమై తలపోటు తెప్పిస్తాయి. అవి హిట్టయ్యాయి. సూర్య చిత్రం ‘రెట్రో’ చూసి మనవాళ్లు బాబోయ్ అన్నారు. కానీ తమిళంలో ఆడింది. ఇప్పుడు ‘మదరాసి’ లాంటి యావరేజ్ సినిమాను కూడా తమిళ జనాలు హిట్ చేసేలాగే కనిపిస్తున్నారు.
This post was last modified on September 7, 2025 6:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…