బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ నిర్మాతగా తీసిన సినిమాకు తెలుగు టైటిల్ పెట్టే విషయంలో చేసిన దారుణమైన పొరపాటు తీవ్ర విమర్శలు తీసుకొచ్చింది. ఒరిజినల్ పేరుని యధాతథంగా పెట్టి దానికి ఇతర భాషల్లో ఎలాంటి బూతు అర్థం వస్తుందో తెలుసుకోకుండా ఏకంగా పోస్టర్ రిలీజ్ చేయడం గట్టిగా తలంటించుకునేలా చేసింది. దెబ్బకు జడిసిన టీమ్ ఇప్పుడా టైటిల్ ని బూకీగా మార్చేసి కొత్తగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పాతవాటిని డిలీట్ చేశారు కానీ వివిధ రూపాల్లో, ఆన్ లైన్ లో ఉన్న అందరి ఖాతాల్లో తీసేయలేరుగా. ఆలా అప్పుడప్పుడు తవ్వుతూనే ఉంటారు.
బూకీ సంగతి పక్కనపెడితే టైటిల్స్ విషయంలో డబ్బింగ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మారాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం ప్యాన్ ఇండియా ట్యాగ్ ని అడ్డం పెట్టుకుని తమిళ, మలయాళం పేర్లు అలాగే పెట్టడం దారుణం. అరవింద్ స్వామి – కార్తీల కాంబోలో గత ఏడాది వచ్చిన మూవీకి సత్యం సుందరం అని అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. ఎందుకంటే తమిళం పేరు నోరు తిరిగదు కాబట్టి. ఇండియన్ 2కి భారతీయుడు 2 అన్నారు. కానీ తంగలాన్, వలిమై, మార్గన్, ఎంపురాన్ అంటూ ముక్క అర్థం కాని పదాలతో కోట్ల బిజినెస్ చేస్తున్నారు. రాబోయే వాటిలో రెట్ట తల అనే సినిమా ఒకటుందంటే వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే ఒకప్పటి ప్రొడ్యూసర్లు డబ్బింగ్ సినిమాలు తెచ్చేటప్పుడు టైటిల్స్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. కాదల్ కొట్టయ్ (ప్రేమలేఖ), ముదలవన్ (ఒకే ఒక్కడు), మిన్సార్ కనవు (మెరుపు కలలు), ఛత్రియన్ (క్షత్రియుడు), ఇరువర్ (ఇద్దరు), దేవర్ మగన్ (క్షత్రియ పుత్రుడు) ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. తలపతిని మన దగ్గర అర్థమయ్యేలా దళపతి అని పెట్టారే తప్ప రజనీకాంత్ సినిమా అని నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయ్యింది. నేటివిటీ లేదు పాడు లేదు అంతా మా ఇష్టం అనే ధోరణిలో ఇతర భాషలను ఇక్కడ రుద్దుతున్నారు.
This post was last modified on September 7, 2025 11:06 am
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…