ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లు ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. హిందీలో ‘గజిని’ సినిమాను రీమేక్ చేస్తే అక్కడా రికార్డ్ బ్రేకింగ్ హిట్టయింది. కానీ గత దశాబ్ద కాలంలో మురుగదాస్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ‘స్పైడర్’ దగ్గర్నుంచి అన్నీ పరాజయాలే.
ఈ మధ్య ఆయన సినిమాల ఫ్రీక్వెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. 2020లో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘దర్బార్’తో పలకరించిన ఆయన.. ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ ఏడాది ఆరంభంలో ఆయన్నుంచి ‘సికిందర్’ సినిమా వచ్చింది. ఇప్పుడు శివకార్తికేయన్ చిత్రం ‘మదరాసి’తో వస్తున్నాడు మురుగదాస్. తన కెరీర్లో ఇంత గ్యాప్ రావడానికి ఒక యానిమేషన్ మూవీయే కారణమని మురుగదాస్ తెలిపాడు.
‘దర్బార్’ కంటే ముందు నుంచి ఒక పెద్ద యానిమేషన్ మూవీ మీద పని చేస్తున్నాడట మురుగదాస్. దాని కోసం చాలా కష్టపడ్డానని.. కానీ చివరికి ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని మురుగదాస్ తెలిపాడు. ఆ సినిమా వల్ల దాదాపు ఐదు సంవత్సరాల సమయం వృథా అయిందని మురుగదాస్ తెలిపాడు.
ఇక మదరాసి సినిమా గురించి మురుగదాస్ మాట్లాడుతూ.. దక్షిణాది వాళ్లందరినీ నార్త్ వాళ్లు మదరాసి అని పిలుస్తుంటారని.. ఈ చిత్రంలో విలన్ కూడా హీరోను అలాగే సంబోధిస్తాడని.. అందుకే ఈ టైటిల్ ఖరారు చేశామని చెప్పాడు. మన దేశంలోకి వస్తున్న ఒక కొత్త సమస్యను ఈ చిత్రంలో చర్చించామని.. ఆ పాయింటే సినిమాకు హైలైట్‌గా ఉంటుందని అన్నాడు. హీరోతో పాటు హీరోయిన్, విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయని.. సినిమాలో నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుందని మురుగదాస్ తెలిపాడు.
This post was last modified on September 4, 2025 2:52 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…