Movie News

‘మిరాయ్’ నిర్మాతకు ‘కిష్కింధపురి’ ప్రొడ్యూసర్ పంచ్

ఆగస్టులో తగిలిన ఎదురు దెబ్బల తర్వాత సెప్టెంబరు సినిమాల మీద ఆశతో ఉంది టాలీవుడ్ బాక్సాఫీస్. ఈ నెలకు ‘ఓజీ’ సహా కొన్ని క్రేజీ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. సెప్టెంబరు రెండో వారంలో బాక్సాఫీస్ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నెల 12న ‘మిరాయ్’ పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. అదే రోజు ‘కిష్కింధపురి’ రానుంది. ‘కాంత’ కూడా ఆ వీకెండ్‌కే షెడ్యూల్ అయింది కానీ.. అది వాయిదా పడడం లాంఛనమే అంటున్నారు. తేజ సజ్జ, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల మధ్యే పోరు ఉండొచ్చు.

ఐతే ముందు సెప్టెంబరు 12కు డేట్ ఫిక్స్ చేసుకుంది ‘కిష్కింధపురి’నే. కానీ తర్వాత అదే తేదీకి ‘మిరాయ్’ రిలీజ్ ఖరారు చేసుకుంది. దీంతో తర్వాత ‘కిష్కింధపురి’ని ఒక రోజు లేటుగా మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ చివ‌రికి 12కే సినిమాను తీసుకురావాల‌ని డిసైడ‌య్యాడు. ఆ ప్ర‌కార‌మే ఈ రోజు ట్రైల‌ర్లోనూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.

‘కిష్కింధపురి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ రిలీజ్ క్లాస్ గురించి చిత్ర నిర్మాత సాహు గార‌పాటికి ప్రశ్న ఎదురైంది. నిర్మాతలందరూ ఒక్కటే అంటారు కదా, ఈ క్లాష్ ఏంటి, ముందు రిలీజ్ డేట్ ప్రకటించిన మీరు ఇబ్బంది ప‌డ‌డం ఏంటి అని అడిగితే.. తన అసంతృప్తిని సాహు బయటపెట్టేశాడు. లేటుగా తమతో పోటీకి వచ్చిన వాళ్లనే దీని గురించి అడగాలని.. ఆయన అన్నాడు.

దీని వల్ల బాధ పడుతోంది మీరు కదా అని అంటే.. నిజంగా ఎవరు బాధ పడతారన్నది సెప్టెంబరు 12న తెలుస్తుందని సాహు అన్నాడు. దీన్ని బట్టి తమ సినిమా కంటెంట్ మీద ఆయన చాలా ధీమాగా ఉన్నారని అర్థమవుతోంది. అంతిమంగా బాక్సాఫీస్ దగ్గర తమ చిత్రమే పైచేయి సాధిస్తుందని.. అప్పుడు ఇబ్బంది పడేది అవతలి వారే అని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. దీనిపై రేప్పొద్దున ‘మిరాయ్’ ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు వచ్చినపుడు నిర్మాత విశ్వ ప్రసాద్‌కు ప్రశ్న ఎదురు కాక పోదు. దానికి ఆయనేమంటారో చూడాలి.

This post was last modified on September 3, 2025 9:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago