Movie News

బూతు టైటిల్ చూసుకోలేదా ఆంటోనీ సర్

తెలుగోళ్లు వట్టి వెధవలోయ్ అని ఓ పెద్దాయన సరదాగా అన్న మాటను డబ్బింగ్ సినిమాల నిర్మాతలు నిజం చేసేలా ఉన్నారు. ఇప్పటికే తమిళ టైటిల్స్ యధాతథంగా పెడుతూ వాటికి అర్థం తెలియకపోయినా సరే చచ్చినట్టు థియేటర్లకు వస్తారనే ధీమాతో దీన్నో ట్రెండ్ గా మార్చేశారు. ఏమైనా అడిగితే పేరులో ఏముంది, కంటెంట్ ముఖ్యం, ప్యాన్ ఇండియా కాబట్టి ఇలా పెట్టక తప్పదు అని కవర్ చేసుకుంటారు. సరే మన ఖర్మని జనాలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడీ ధోరణి కొత్త పుంతలు తొక్కుతోంది. విజయ్ ఆంటోనీ నిర్మాతగా రూపొందిన తమిళ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టారు. సమస్య అది కాదు.

మన దగ్గరకు వచ్చేటప్పటికీ అది పచ్చి బూతుగా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పదం ఇబ్బంది కలిగించేది కాదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం లేవనెత్తేదే. కనీసం డబ్బింగ్ చేస్తున్న టైంలో టీమ్ లో ఒక్క తెలుగు వారు కూడా లేరా అనే అనుమానం మీలో కలిగితే అది తప్పేం కాదు. సాధారణంగా విజయ్ ఆంటోనీకి తెలుగు ఆడియన్స్, మార్కెట్ అంటే చాలా గౌరవం. ఇప్పటికీ తన సినిమాలు ఏపీ, తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాయంటే దానికి కారణం బిచ్చగాడు ఇచ్చిన ఇమేజ్. కానీ ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోకుండా విజయ్ ఆంటోనీ తొందరపడిన మాట వాస్తవం.

ఇదొక సీరియస్ ఇష్యూ గా పరిగణించకపోతే రాను రాను ఇంకా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తంగలాన్, తలైవి, వెట్టయాన్, మార్గన్, వలిమై అంటూ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటూ వస్తే పోనిలే అంటూ సర్దుకుంటూ వచ్చిన జనాలను మరీ ఇంత లోకువగా చూడకూడదు. సోషల్ మీడియాలో నెటిజెన్లు అప్పుడే తలంటడం మొదలుపెట్టారు. ఒక్కసారి అర్థం కనుక్కుని ఆ తర్వాత ప్రమోషన్లు చేయమని కోరుతున్నారు. ఇందులో విజయ్ ఆంటోనీ హీరో కాదు. నిర్మాత మాత్రమే. అయినా సరే పూర్తి బాధ్యత దర్శకుడితో సమానంగా ఈయనకు దక్కుతుంది. మరి త్వరగా డ్యామేజ్ రిపేర్ చేసుకుంటే బెటర్.

This post was last modified on September 2, 2025 7:14 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

1 hour ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago