Movie News

ఒకే ఒక్కడు – పవన్ నుంచి పవర్ దాకా

వరసగా రెండు మూడు డిజాస్టర్లు వస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా నెంబర్లు మారిపోయే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది హిట్టు ఫ్లాపు పట్టించుకోకుండా అభిమానగణం అంతకంతా పెరుగుతూ పోవడమనేది అందరికీ జరగదు. అందులోనూ నాకు డాన్సులు రావు, యాక్టింగ్ సీరియస్ గా తీసుకోను అంటూ పబ్లిక్ స్టేట్ మెంట్స్ ఇచ్చే నటుడి వెనుక కోట్లాది మంది ఉండటం సాధ్యమా. తీవ్ర నష్టాలు తెచ్చిన సినిమా తర్వాత కొత్త రిలీజ్ వస్తోందంటే టికెట్ల కోసం కాదు దాని టి షర్టుల కోసం ఎగబడటం ఎక్కడైనా చూశామా. వీటన్నింటిని సాధ్యం చేసి చూపించిన ఒకే ఒక్క పేరు పవన్ కళ్యాణ్. పొలిటికల్ భాషలో చెప్పాలంటే పవర్ కళ్యాణ్.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేసినప్పుడు ప్రేక్షకులు తనని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే చూశారు. అందులో టాలెంట్ నిరూపించుకున్నాక కూడా ఆ బ్రాండ్ అంత తొందరగా పోలేదు. తొలిప్రేమతో కుర్రాడిలో విషయముందని యూత్ కి తెలిసిపోయింది. ఖుషి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాక ఇతను మెగా బినామీ కాదు ఒరిజినల్ సునామి అని ట్రేడ్ అర్థం చేసుకుంది. జానీ రూపంలో ప్రయోగం చేయబోయి దారుణంగా బోల్తా కొట్టినా తన సిన్సియారిటీని అభిమానులు అర్థం చేసుకున్నారు. చెక్కు చెదరని ప్రేమని పెంచుకుంటూపోయారు తప్ప తగ్గించుకోలేదు.

కెరీర్ పరంగా ఎన్నో ఆటుపోట్లు. బాక్సాఫీస్ పరాజయాలు. అయిదు ఫ్లాపులు పలకరిస్తే ఒక్క బ్లాక్ బస్టర్ మొత్తం లెక్కలు మార్చేసేది. రిలీజ్ కు ముందే ఒరిజినల్ ప్రింట్ పైరసీకి గురైన అత్తారింటికి దారేది థియేటర్ రన్ లో సరికొత్త మైలురాళ్ళు సృష్టించడం నభూతో నభవిష్యత్. పనైపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు గబ్బర్ సింగ్ ఇచ్చిన బెల్ట్ ట్రీట్ మెంట్ ఇప్పట్లో మర్చిపోయేది కాదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అంటూ వరసగా రీమేకులు చేసినా వాటిని ఆదరించి కలెక్షన్లు ఇచ్చిన పెద్ద మనసు ఫ్యాన్స్ ది. అందుకే హరిహర వీరమల్లు ప్రభావం ఓజి మీద కించిత్ కూడా పడలేదు సరికదా ట్రేడ్ నివ్వెరపోయేలా బుకింగ్స్ జరుగుతున్నాయి.

సినిమా ప్రస్థానం ఒక ఎత్తు అయితే రాజకీయ ప్రయాణం మరో మిరాకిల్. ప్రజారాజ్యం పెట్టి అన్న వైఫల్యం చెందినా సమాజానికి ఏదో చేయాలనే లక్ష్యంతో పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఎన్నెన్నో కామెంట్లు. రెండుసార్లు ఓటమి చూసి నవ్వుకున్న వాళ్ళే ఎక్కువ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి రూలింగ్ పార్టీ దారుణమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడినా ఓర్పుతో తన రాజకీయ చదరంగం ఆడాడు. తలపండిన రాజకీయ దిగ్గజం చంద్రబాబునాయుడుకి అండగా నిలబడి కూటమి అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించాడు. వంద శాతం స్ట్రైక్ రేట్ లో అందరి మతులు పోగొట్టారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సిఎం మాత్రమే కాదు. ఒక పవర్ స్టార్. ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఒక గైడెన్స్ పవర్. తన ప్రయాణంలో ఎన్నో బ్రేకులు పడ్డాయి. ఎన్నో తప్పులు జరిగాయి. వాటిని సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ రెండు పడవల ప్రయాణాన్ని తుఫానులో సైతం చెక్కుచెదరకుండా నడిపిస్తున్న జనసేనాని అసలైన జర్నీ ఇప్పుడు మొదలయ్యింది. మూడు పర్యాయాలు గెలిచిన ప్రధాన మంత్రికి అత్యంత ఆప్తుడిగా మారడమంటే మాములు విషయం కాదు. థియేటర్లనే కాదు రాజకీయాలను సైతం షేక్ చేసే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కన్నా సంబరం ఫ్యాన్స్ కు ఇంకేముంటుంది.

This post was last modified on September 2, 2025 8:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

21 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

25 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

28 minutes ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

36 minutes ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

46 minutes ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

50 minutes ago