స్వర్గీయ శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ కు ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అమ్మ స్థాయికి చేరుకోలేక హిట్టు కోసం పోరాడుతూనే ఉంది. బాలీవుడ్ సంగతి ఎలా ఉన్నా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో జోడి కట్టే క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ముందు ఒక రీమేక్ ప్రతిపాదన వచ్చిందట. అదే తల్లి నటించిన క్లాసిక్ హిట్ మూవీ చాల్ బాజ్. శ్రీదేవి ద్విపాత్రాభినయం పోషించిన చాల్ బాజ్ లో రజనీకాంత్, సన్నీ డియోల్ హీరోలుగా నటించారు. 1989లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. దీనికి మూలం వాణిశ్రీ గంగ మంగ, హేమమాలిని సీతా ఔర్ గీతా.
ప్రేక్షకుల హృదయాల్లో ఒక కల్ట్ గా నిలిచిపోయిన చాల్ బాజ్ ని మళ్ళీ తీయడం చాలా రిస్క్. ఎందుకంటే ఖచ్చితంగా పోలికలు వస్తాయి. దానికి తోడు పెర్ఫార్మన్స్ పరంగా రెండు క్యారెక్టర్లు ఎంతో డిమాండ్ చేస్తాయి. వాటిని జాన్వీ కపూర్ బ్యాలన్స్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ట్రోలర్స్ వీడియోలను పక్క పక్కన పెట్టి మరీ తలంటేస్తారు. అందుకే జాన్వీ తొందరపడకుండా ఆలోచించే పనిలో ఉందట. ఈ నెలాఖరులో ఒక నిర్ణయం చెప్పమని నిర్మాతలు అడిగారట. ఎవరనేది బయటికి రాలేదు కానీ చాల్ బాజ్ ప్రొడ్యూసర్ మన తెలుగాయనే. ఏ పూర్ణచందర్ రావు కుటుంబం దగ్గర హక్కులు ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించి వేరే రిస్కులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టులను రీ ప్లేస్ చేయడం పెద్ద టాస్క్. చాల్ బాజ్ లో నటించిన రజనీకాంత్, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, రోహిణి హట్టంగడి, అన్ను కపూర్, శక్తి కపూర్, జానీ లివర్ తదితరులంతా బ్రతికే ఉన్నారు. కానీ వయసు రిత్యా రిపీట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి వీళ్లకు ధీటుగా నటించే తారాగణాన్ని సెట్ చేసుకోవాలి. అదే పెద్ద సవాల్. ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి జాన్వీ తీవ్రాలోచనలో ఉందట. తొందపడకుండా అందరి అభిప్రాయాలు తీసుకుంటోంది. తండ్రి బోనీ కపూర్ మాత్రం జాన్వీ ఇష్టానికే నిర్ణయాన్ని వదిలేసినట్టు ముంబై టాక్.
This post was last modified on September 1, 2025 11:53 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…