ఆదిత్య 999… నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లో ఒక మైలరాయిలా నిలిచిపోయిన ఆదిత్య 369కు సీక్వెల్ తీయాలని ఆయన ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతోనే ఈ సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ ఆయనకు వయసు మీద పడింది. ఫామ్ కూడా కోల్పోయారు. ఈ సీక్వెల్‌కు స్టోరీ బోర్డ్‌తో సహా స్క్రిప్టు రెడీగా ఉంది. ఒక దశలో బాలయ్యే స్వయంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నాడు. కానీ తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు.
ఐతే ఈ మధ్య దర్శకుడిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన క్రిష్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ ప్రచారం గురించి క్రిష్‌ను అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేదు. తన కొత్త చిత్రం ఘాటి ప్రమోషన్లలో భాగంగా ఆదిత్య 999 గురించి అడిగితే.. ఈ సినిమాను ప్రకటించాల్సింది బాలయ్యే అని.. తాను దాని గురించి మాట్లాడలేనని తేల్చేశాడు క్రిష్.
ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తాడన్నది నిజమా అంటే అది కూడా బాలయ్యే చెప్పాలన్నాడు. ఏదైనా బాలయ్య నోటి నుంచే వినాలని ఆయన స్పష్టం చేశాడు. ఘాటి నిర్మాత అయిన క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు కానీ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. క్రిష్ అయితే ఆ మాత్రం సమాచారం కూడా చెప్పలేదు కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ లాక్ ఐపోయి లాంచ్ కు సిద్ధంగా ఉంది.
ఇక హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడం, ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడం గురించి ప్రశ్నిస్తే.. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ అని, నిర్మాత ఏఎం రత్నం అంటే ఎంతో గౌరవమని.. ఐతే షెడ్యూలింగ్ సమస్యలు, తన వ్యక్తిగత ఇబ్బందుల వల్లే ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. దీంతో జ్యోతికృష్ణ మిగతా భాగం పూర్తి చేశారని.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చాక తన ఫోకస్ అంతా ఘాటి మీదే ఉందని చెబుతూ వీరమల్లు రిజల్ట్ గురించి ఏమీ కామెంట్ చేయలేదు క్రిష్.
This post was last modified on September 1, 2025 9:35 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…