సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ కంటెంట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఓజితో పోలిక, పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఒకరోజు ముందుగానే మాస్ పోస్టర్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓజి టీమ్ నుంచి ఏం వస్తుందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. టీజర్ ఆశిస్తున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో సుజిత్ చాలా బిజీగా ఉండటంతో ఎడిట్ చేయించే టైం కూడా లేదట. ఒక వెర్షన్ సిద్ధమయ్యింది కానీ పవన్ కి చూపించకుండా వదల్లేరు. అటు చూస్తే విశాఖ సభ, అల్లు కుటుంబానికి పరామర్శలతో పవర్ స్టార్ బిజీగా గడిపేశారు.
సో ఒక్క రోజులో ఏమైనా ఫైనల్ అయితే పండగే. కాకపోతే మాత్రం కొత్త పోస్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. జల్సా రీ రిలీజ్ ని రద్దు చేశారు. గతంలో ఒకసారి విడుదలైనప్పటికీ అకేషన్ ఉంది కాబట్టి మళ్ళీ చేద్దామనుకున్నారు కానీ తమ్ముడుకి బ్యాడ్ రెస్పాన్స్ రావడం, అరవింద్ తల్లిగారు అర్ధాంతరంగా కన్ను మూయడం తదితర పరిణామాల వల్ల క్యాన్సిల్ చేశారు. కొన్ని చోట్ల మాత్రం తమ్ముడు స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఇక పవన్ నెక్స్ట్ చేయబోయే సినిమాల లిస్టులో ఉన్న కెవిఎన్ ప్రొడక్షన్స్, నిర్మాత రామ్ తాళ్ళూరి వైపు నుంచి ఏమైనా ప్రకటనలు రావొచ్చని భావిస్తున్నారు కానీ డౌట్ గానే ఉంది.
ప్రస్తుతానికి వీటితోనే సర్దుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం ఓజి జపంలో మునిగి తేలుతున్నారు. ఓవర్సీస్ లో రికార్డులు మొదలైపోయాయి. మిలియన్ కు దగ్గరలో ఉండగా రెండు మూడు రోజుల్లో ఆ లాంఛనం అయిపోతుంది. జనసేన, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలతో సినిమా కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టలేకపోతున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జర్పుకుంటున్న రెండో బర్త్ డే ఇది. 2025 మరో రకంగా కూడా స్పెషల్ గా నిలుస్తుంది. ఒకే సంవత్సరంలో కేవలం రెండు నెలల గ్యాప్ లో రెండు పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ కావడం ఇదే మొదటిసారి.
This post was last modified on September 1, 2025 9:11 am
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…