కళ్యాణి ప్రియదర్శన్. పేరుకి మలయాళీనే కానీ తెరంగేట్రం చేసింది తెలుగు సినిమాలతోనే. అఖిల్ హలోతో ఎంట్రీ ఇచ్చి సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో హిట్ అందుకున్నాక శర్వానంద్ రణరంగం డిజాస్టర్ మళ్ళీ వెనక్కు రాకుండా చేసింది. తర్వాత తన స్వంత బాషలోనే కళ్యాణి బిజీ అయిపోయింది. ఈమె తండ్రి ప్రియదర్శన్ సుప్రసిద్ధ దర్శకుడన్న సంగతి తెలిసిందే. నాగార్జునతో నిర్ణయం తీసింది అభిమానులకు గుర్తే. ఆయన తీసిన ఎన్నో క్లాసిక్స్ టాలీవుడ్ లో రీమేకై బ్లాక్ బస్టర్స్ సాధించాయి. తండ్రి పేరుని జోడించుకున్న కళ్యాణికి ఈ వారం స్పెషల్ గా నిలిచిపోయింది. ఒక రోజు గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజయ్యాయి.
మొదటిది లోక చాప్టర్ 1 చంద్ర. సూపర్ హీరో తరహా ఎలివేషన్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామాకు మంచి రివ్యూస్ వచ్చాయి. పబ్లిక్ టాక్ డీసెంట్ గా ఉంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ గా విశ్లేషకులు పేర్కొన్నారు. తెలుగులో కొంత ఆలస్యంగా నిన్న రాత్రి నుంచి షోలు మొదలైనప్పటికీ ఆక్యుపెన్సీలు బాగుండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. టైటిల్ కొత్త లోక అని అర్థమయ్యీ కానట్టు పెట్టినా టాక్ తెలుసుకున్న జనాలు టికెట్లు కొనేసుకుంటున్నారు. ఈ వీకెండ్ స్ట్రెయిట్ సినిమాలను కాదని మరీ ఈ కొత్త లోకనే ఫస్ట్ ఛాయస్ కావడం ఖాయం. సితార డిస్ట్రిబ్యూషన్ ప్లస్ అయ్యింది.
ఇక రెండో సినిమా ఒదుమ్ కుతిరా చాదుమ్ కుతిర. అంటే పరిగెత్తే గుర్రం ఎగిరే గుర్రం. పుష్ప విలన్ ఫాహద్ ఫాసిల్ ఇందులో హీరో. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ఒక కుర్రాడి లైఫ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. భరించలేని తలనెప్పిగా ఉందని క్రిటిక్స్ ఓ రేంజ్ లో తలంటేశారు. ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఇవేవి లేకుండా ఊరికే సీన్లను పేర్చుకుంటూ పోయి సహనంతో ఆడుకున్నారని క్లాసులు పీకారు. రెండు మంచి అంచనాలున్న సినిమాలతో ఒకే టైంలో వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ కి ఒకటి తుక్కు కాగా మరొకటి కిక్కు ఇచ్చింది.
This post was last modified on August 30, 2025 2:43 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…