‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎవరుండాలి.. ఎవరు వెళ్లిపోవాలి అనేది నిర్ణయించేది ప్రేక్షకులే అని, ఎలిమినేషన్ పూర్తిగా వారి ఓటింగ్ ఆధారంగానే జరుగుతుందని షో నిర్వాహకులు ఎప్పుడూ నొక్కి వక్కాణిస్తుంటారు. ఐతే కంటెస్టెంట్ల ప్రవర్తన ఆధారంగా జనాల అభిప్రాయం ఏంటన్నది తెలిసిపోతూనే ఉంటుంది. మెజారిటీ అభిప్రాయాన్ని బట్టే ఎలిమినేషన్ జరుగుతుందని ఆశిస్తాం. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్స్ తెలిసిపోతుంటాయి.
ఐతే నాలుగో సీజన్ ఆరంభం నుంచి జనాల వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్లలో మోనాల్ గుజ్జర్ ఒకరన్నది స్పష్టం. ఆమె ప్రతిదానికీ ఎమోషనల్ అయిపోవడం.. డబుల్ గేమ్ ఆడటం జనాలకు నచ్చట్లేదు. మోనాల్ పేరు ట్విట్టర్లో కొడితే ఆమెపై ఉన్న వ్యతిరేకత ఎలాంటిదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఐతే ఆమె ఎలిమినేషన్లోకి రావడమే తక్కువ. వచ్చినా ప్రతిసారీ సేఫ్ అయిపోతూ ఉంటుంది. ఇది మెజారిటీ ప్రేక్షకులకు అస్సలు రుచించట్లేదు.
స్వతహాగా హీరోయిన్ కాబట్టి, గ్లామర్ అన్నది ఎసెట్ కాబట్టి షోలో ఉన్న అందరు అమ్మాయిల్లోకి రేంజ్ పరంగా మోనాల్ ఎక్కువే. ఆమెకు ఎక్కువ పారితోషకం ఇచ్చే షోకు తీసుకుని వచ్చి ఉంటారు. అలాంటి ఆకర్షణీయ అమ్మాయిని ఆరంభంలోనే పంపేయడం కరెక్ట్ కాదు. కానీ జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. ఆమె కచ్చితంగా బయటికి వెళ్లిపోతుందన్న అంచనాలు కనిపిస్తున్నా సేఫ్ అయిపోతుండటం ఆశ్చర్యకరం.
ఇక్కడ బిగ్ బాస్ టీం మ్యానుపులేట్ చేస్తోందన్న అనుమానం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ వారం లాస్య ఎలిమినేట్ అయిందంటున్నారు. మోనాల్‌తో పోలిస్తే ఆమె బెటర్ కంటెస్టెంట్ అన్నది స్పష్టం. ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే జనాల మద్దతు లాస్యకే అని అర్థమవుతోంది. అయినా సరే.. మోనాల్ సేవ్ అయిపోవడమేంటో తెలియట్లేదు. ఈమెను బిగ్ బాస్ టీం ఎందుకు కాపాడుతోందంటూ జనాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్న సంగతి నిర్వాహకులకు తెలుస్తోందా?
This post was last modified on November 23, 2020 8:12 am
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…