ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. స్వర్గీయ రమేష్ బాబు కొడుకు జయకృష్ణ తెరంగేట్రం కోసం గ్రౌండ్ రెడీ చేశారు. ఆరెక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ద్వారా రవీనాటాండన్ కూతురు రషా తదాని టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఇంకా ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించకపోయినా తెరవెనుక లాంఛనాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయట. శ్రీనివాస మంగాపురం టైటిల్ ని దాదాపు లాక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా కీలకమైన పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓకే చెప్పారనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కొంచెం లోతుగా వెళ్తే మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి. జయకృష్ణ లాంచింగ్ వ్యవహారాలు చూస్తున్న మహేష్, నమ్రతలు అతని కోసం మరీ సాఫ్ట్ లవ్ స్టోరీ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టుకే ఓకే చెప్పారట. అంటే మహేష్ బాబు సోలో హీరోగా డెబ్యూ చేసిన రాజకుమారుడు తరహాలో ఒక కంప్లీట్ ప్యాకేజీతో అన్ని ఉండేలా చూసుకున్నారని వినికిడి. బడ్జెట్ విషయంలో రాజీ ఉండదట. మోహన్ బాబు పాజిటివ్ గా స్పందించడానికి కారణముంది. గతంలో కృష్ణ, మహేష్ బాబుతో కలిసి ఆయన కొడుకు దిద్దిన కాపురం లాంటి సూపర్ హిట్స్ లో నటించారు. రమేష్ బాబుతో తెరను పంచుకున్న అనుభవముంది.
ఇప్పుడు జయకృష్ణ అంటే మూడో జనరేషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన జ్ఞాపకం మిగులుతుంది. కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుందని వినికిడి. క్లైమాక్స్ మాత్రం అజయ్ భూపతి స్టైల్ లో ఎవరూ ఊహించని ట్విస్టులతో ఉంటుందని, మహేష్ ఇంప్రెస్ కావడానికి కారణం అదే అంటున్నారు. ఎంత కష్టపడుతున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్న సుధీర్ బాబు లాగా పొరపాట్లు రిపీట్ కాకుండా జయకృష్ణకు సంబంధించిన ప్లానింగ్ అంతా పిన్ని, బాబాయ్ చూసుకుంటారని అంతర్గత సమాచారం. షూటింగ్ దసరా నుంచి మొదలుపెట్టి వచ్చే వేసవికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
This post was last modified on August 29, 2025 3:18 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…