అనుకున్న దానికన్నా పెద్ద సునామినే పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్నాడు. నార్త్ అమెరికాలో మొదలుపెట్టిన అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే మూడు లక్షల డాలర్లు అధిగమించడం చూసి ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. రిలీజ్ కు ఇంకా ఇరవై ఏడు రోజులు ఉంది కాబట్టి అప్పటికంతా అంకెలు ఎక్కడికో వెళ్ళిపోతాయని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఓజి మొదటి టార్గెట్ కూలీ. ప్రీమియర్ల ద్వారా 3 మిలియన్ మార్క్ తో నాలుగో స్థానంలో ఉండగా పుష్ప టూ 3.35, ఆర్ఆర్ఆర్ 3.5, కల్కి 3.9 మిలియన్ డాలర్లతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. సమయం చాలా ఉంది కనక కనీసం టాప్ 3కి వెళ్లొచ్చని ఫ్యాన్స్ నమ్మకం.
ఒకవేళ అదే కనక జరిగితే పుష్ప 2 దాటిన ఘనతని ఓజి సొంతం చేసుకుంటుంది. ఇది మెగా ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతారు. ఎందుకనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంత కాలంగా మెగా హీరోలను డిజాస్టర్లు ముంచెత్తుతున్నాయి. భోళా శంకర్, మట్కా, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు ఒకదాన్ని మించి మరొకటి దారుణమైన ఫలితాలు చూశాయి. ఆ గాయాలు గుర్తు చేసుకుని ఫ్యాన్స్ తెగ కలవరపడుతూ ఉంటారు. ఇప్పుడు ఓజి ఆ లెక్కలన్నీ సరిచేయాలని వాళ్ళ కోరిక. బజ్, బుకింగ్స్ జోరు చూస్తుంటే అదేమీ అసాధ్యం కాదనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రియల్ స్టామినా బయటికి తీసుకొచ్చే సినిమాగా ఓజి నిలిచేలా ఉంది.
ఇక అసలు డ్యూటీ చేయాల్సింది డివివి ఎంటర్ టైన్మెంట్స్. ప్రమోషన్లతో కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఓ పాతిక రోజులు పబ్లిసిటీ జాగ్రత్తగా చేసుకుంటే ఓపెనింగ్స్ విషయంలో ఆకాశమే హద్దవుతుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ద్వారా బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ మొదటిసారి హీరోయిన్ గా నటించింది. తమన్ రెండు పాటలు ఆల్రెడీ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. సువ్వి సువ్వి సువ్వాలా మెల్లగా ఎక్కినా మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అసలైన ట్రైలర్ కి ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు.
This post was last modified on August 29, 2025 12:49 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…