ఒక హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం అరుదు. తెలుగులో ఈ అరుదైన జాబితాలో ఇద్దరు హీరోలున్నారు. నందమూరి బాలకృష్ణ చిత్రాలు బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకేసారి విడుదలయ్యాయి. అందులో మొదటి సినిమా హిట్టయితే, రెండోది పోయింది. చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో మొదటిది ఆడింది. రెండోది ఫ్లాప్ అయింది. ఇలా ఒక హీరో సినిమాలు ఒకే రోజు రిలీజవడంతో ఆ హీరోతో పాటు అందరికీ ఇబ్బందే. బాలయ్య, నాని విషయంలో అనివార్యంగా అలా జరిగిపోయింది.
ఇదే తరహాలో తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా తనతో తానే పోటీ పడబోతున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వచ్చాయి. అతను నటించిన ఎల్ఐకేతో పాటు డూడ్ చిత్రాలు దీపావళి కానుకగా ఒకే రోజు రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రెండు సినిమాల పోస్టర్ల మీద దీపావళి రిలీజ్ అనే కనిపించింది. వాటి మేకర్స్‌లో ఎవ్వరూ తగ్గేలా కనిపించకపోవడంతో బాలయ్య, నానిల ఫీట్‌ను ప్రదీప్ రిపీట్ చేయబోతున్నాడని అనుకున్నారంతా. కానీ ఇలా జరగబోదని స్వయంగా ప్రదీపే క్లారిటీ ఇచ్చాడు. తన రెండు సినిమాల్లో ఒక్కటే దీపావళికి వస్తుందని అతను తేల్చేశాడు. కానీ ఆ సినిమా ఏదన్నది మాత్రం అతను వెల్లడించలేదు. ఐతే దీపావళికి తన అభిమానుల సెలబ్రేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని అతను చెప్పాడు.
నయనతార భర్త రూపొందించిన ఎల్ఐకేకు కంటెంట్ వల్ల మంచి క్రేజ్ లభిస్తోంది. అయితే, యంగ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ తెరకెక్కించిన డూడ్ మొదటి పాటతో పెద్దగా బజ్ తెచ్చుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఇందులో ప్రేమలు భామ మామిత బైజు, ప్రదీప్‌కు జోడీగా నటించింది. మరోవైపు, ఎల్ఐకేలో ఉప్పెన భామ కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఐతే రెండు చిత్రాల్లో ముందు మొదలైంది ఎల్ఐకేనే కాబట్టే అదే దీపావళికి వస్తుందేమో చూడాలి. లవ్ టుడేతో దర్శకుడిగా, నటుడిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రదీప్… ఈ ఏడాది హీరోగా డ్రాగన్ మూవీతో మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకుని యూత్‌లో తన క్రేజ్ పెంచుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates