ఈ వారం చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ని పలకరిస్తున్నాయి. కౌంట్ తొమ్మిదిపైనే ఉంది కానీ దేనికీ బలమైన ఓపెనింగ్స్ వచ్చేలా లేవు. పాజిటివ్ మౌత్ టాక్, రివ్యూలతోనే ఇవి జనాలను ఆకట్టుకునే పరిస్థితి నెలకొంది. మలయాళంలో మంచి రిపోర్ట్స్ సాధించిన ‘కొత్త లోక’ తెలుగు వెర్షన్ ఒక రోజు ఆలస్యంగా సితార డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ఫాంటసీ డ్రామాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయట. క్రైమ్ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’ కోసం సత్యరాజ్, ఉదయభాను తదితరులు ఎడతెగని ప్రమోషన్లు చేశారు.
తెలియని క్యాస్టింగ్ పెద్దగా లేకపోయినా ట్రైలర్ తో ఆడియన్స్ దృష్టిలో పడిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. ఆమని ప్రధాన పాత్ర పోషించిన ‘బ్రహ్మాండ’ వెనుక ఓ ట్రాజెడీ ఉంది. కొన్ని వారాల క్రితం దీని ప్రీమియర్ జరుగుతున్నప్పుడే దర్శకుడు రామ్ బాబు కన్నుమూశారు. ఇవి కాకుండా రాజుగాని సవాల్, అగ్రహారంలో అంబేద్కర్ అనే మరో రెండు చిన్న చిత్రాలు బరిలో ఉన్నాయి. నాగార్జున ‘రగడ’ను రీ రిలీజ్ చేస్తున్నా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. స్టాలిన్ లాగే ఇది కూడా ఫెయిల్యూర్ గా నిలిచేలా ఉంది. హైదరాబాద్ లో కొన్ని షోలు తప్ప మిగిలిన చోట రెస్పాన్స్ లేదు.
ఇవి కాకుండా నారా రోహిత్ ‘సుందరకాండ’ రెండు రోజుల ముందే థియేటర్లకు వచ్చింది. కొంచెం డీసెంట్ టాక్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఫుల్ చేయలేకపోతోంది. వీకెండ్ ఏమైనా వాడుకుంటే సేఫ్ కావొచ్చు. జాన్వీ కపూర్ నటించిన బాలీవుడ్ మూవీ ‘పరం సుందరి’ మీద మల్టీప్లెక్సులు ఆశలు పెట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ మరోసారి శనివారం అభిమానుల కోసం వస్తోంది. ఇన్నేసి సినిమాలు సందడి చేస్తున్నాయి కానీ థియేటర్లలో జనాలు నిండుగా ఉంటేనే పరిశ్రమ వర్గాలు సంతోషిస్తాయి. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్న వర్షాలు బాగా ఇబ్బంది కలిగిస్తున్న మాట వాస్తవం.
This post was last modified on August 28, 2025 10:19 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…