Movie News

నిఖిల్ వేగం పెంచాల్సిన టైమొచ్చింది

యూత్ హీరో నిఖిల్ ఈ మధ్య బొత్తిగా కనిపించడం లేదు. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాక ఒక్కసారిగా నెమ్మదించడం అభిమానులను టెన్షన్ పెడుతోంది. 18 పేజెస్ ఓ మోస్తరుగా బాగానే ఆడినా స్పై రూపంలో దక్కిన డిజాస్టర్ కొంచెం బ్రేక్ వేసింది. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉండి లేట్ గా రిలీజయ్యింది కాబట్టి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ని కౌంట్ లోకి వేసుకోకపోయినా ఫిల్మోగ్రఫీలో ఒక ఫ్లాప్ గా మిగిలిపోయింది. వీటిని మినహాయిస్తే ఒక పెద్ద హిట్టు తర్వాత నిఖిల్ చూసిన గ్యాప్ అక్షరాలా మూడు సంవత్సరాలు. ఇప్పటిదాకా కొత్త సినిమా రిలీజ్ డేట్ రాలేదు.

స్వయంభు మీద ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. పీరియాడిక్ సెటప్ లో చాలా పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిఖిల్ దీనికోసం కత్తిసాము, మల్లయుద్ధం లాంటివి నిజంగా నేర్చుకుని డూప్స్ లేకుండా రిస్క్ చేశాడు. కానీ ఇప్పటిదాకా విడుదల తేదీ కానీ, షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందనే కబురు కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి రాలేదు. రామ్ చరణ్ నిర్మాతల్లో ఒకడిగా వ్యవహరిస్తున్న ది ఇండియా హౌస్ కూడా నిఖిల్ కు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. కొన్ని వారాల క్రితం భారీ ఖర్చుతో వేసిన సెట్స్ వాటర్ ట్యాంకర్ డామేజ్ అవడం వల్ల మొత్తం కూలిపోయింది. దీంతో తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నో అప్డేట్.

నిన్న ఏషియన్ సంస్థ ఒక సూపర్ హీరో మూవీ చేయబోతున్నట్టు కొత్త అనౌన్స్ మెంట్ ఇచ్చింది. దర్శకుడు, టీమ్ తదితర వివరాలు చెప్పలేదు కానీ నిఖిల్ ఖాతాలో మరో ప్యాన్ ఇండియా మూవీ తోడయ్యింది. వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎప్పుడు వస్తాయో తెలిస్తే ఫ్యాన్స్ కొంత నిశ్చింతగా, బయ్యర్లు కొంచెం ప్లానింగ్ తో ఉండడానికి అవకాశముంటుంది. 2025లో నిఖిల్ రిలీజ్ లేనట్టే. 2026 సంక్రాంతికి ఆల్రెడీ స్లాట్స్ లాక్ అయిపోయాయి. వేసవికి పెద్ది, తారక్ – నీల్, ది ప్యారడైజ్, విశ్వంభర లాంటివి కాచుకుని ఉన్నాయి. మరి స్వయంభు ఏం చేస్తుందో ఎప్పుడు వస్తుందో అర్జెంట్ గా సమాధానం దొరకాల్సిన పెద్ద ప్రశ్న.

This post was last modified on August 28, 2025 12:42 pm

Share

Recent Posts

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…

38 minutes ago

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

4 hours ago

రామాయణ 2 కోసం చాలా దాచి పెట్టారు

దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…

4 hours ago

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో…

4 hours ago

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

5 hours ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

5 hours ago