Movie News

కింగ్డమ్ గురించి ఇంకెందుకు చర్చ

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కింగ్డమ్ థియేట్రికల్ గా ఎంత నష్టపరిచిందో చూశాం. నిర్మాత నాగవంశీ స్టేట్ మెంట్లకు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాన్ఫిడెన్స్ కి సంబంధం లేకుండా ఫలితం దక్కడం రౌడీ బాయ్ అభిమానులను కలవరపెట్టింది. కేవలం నాలుగు వారాల విండోతో ఇవాళ నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. బిగ్ స్క్రీన్ మీద మిస్సైన హృదయం లోపల పాట డిజిటల్ లోనూ లేదు. అదనపు సీన్ల ఊసే లేదు. కొన్ని డివైజెస్ లో ఆడియో ప్రాబ్లమ్ వచ్చిందని సోషల్ మీడియాలో కంప్లయింట్స్ వచ్చాయి. వాటిని సరిచేసే పనిలో నెట్ ఫ్లిక్స్ టీమ్ ఉందట.

ఇదంతా పక్కనపెడితే అసలు కింగ్డమ్ గురించి ఏ చర్చ అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అదనపు ఫుటేజ్ జోడిస్తే ఫ్యాన్స్ కొంచెం ఆసక్తి చూపించవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుల్లో దాని మీద అంత ఇంటరెస్ట్ ఉండదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి కోసం ఎడిట్ చేసిన సీన్లను జోడించే ఆలోచన చేశారట. కానీ అలా చేయడం వల్ల గంట దాకా నిడివి పెరిగే అవకాశం ఉండటంతో నెట్ ఫ్లిక్స్ నుంచే వద్దనే మాట వినిపించిందట. ఫ్లాప్ మూవీస్ కి ఈ మధ్య వ్యూస్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇప్పుడు లెన్త్ మరింత పెంచితే వ్యూయర్ షిప్ పరంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో నో చెప్పారనే టాక్ ఉంది.

అయినా గతంలోలా ఇప్పుడు ఓటిటి రిలీజులకు పెద్దగా సౌండ్ ఉండటం లేదు. జనాలు తెలివి మీరిపోయారు. వీటికి కూడా టాక్స్, రివ్యూలను ప్రామాణికంగా తీసుకుని సమయం కేటాయించాలా వద్దాని నిర్ణయించుకుంటున్నారు. ప్రమోషన్ టైంలో కింగ్డమ్ 2 గురించి టీమ్ చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడా సూచనలు తగ్గిపోతున్నాయి. బాక్సాఫీస్ ఫలితం సానుకూలంగా రాకపోవడంతో సీక్వెల్ ప్లాన్ ని డ్రాప్ చేశారని టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ త్వరలో ఏదో ఒక ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on August 27, 2025 6:47 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

22 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

29 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

33 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

55 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago