‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ను చూసి ఇండియన్ ఆడియన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. ఈ సినిమా కూడా హిట్టయినప్పటికీ.. రాజమౌళి స్థాయిలో లేదని, ‘బాహుబలి’ ముందు ఇది తక్కువే అని అన్నారు. కానీ ఈ చిత్రం అనూహ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ జనాలు ఈ సినిమా చూసి అబ్బురపడ్డారు. జేమ్స్ కామెరూన్ సహా ఎంతోమంది ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ మీద ప్రశంసలు కురిపించారు. నేటివ్ అమెరికన్స్ ఈ సినిమా చూసి ఊగిపోయారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ అవార్డు కూడా లభించింది.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’కు ఇంత ఫిదా అయిన వాళ్లు.. ‘బాహుబలి’ చూస్తే ఏమనేవారో అన్న ఫీలింగ్ కలిగింది మన వాళ్లకు. ఐతే ఆ తరహా సినిమాలు హాలీవుడ్లో కొత్తేమీ కాదని, ‘ఆర్ఆర్ఆర్’యే వాళ్లకు భిన్నంగా అనిపించింది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ‘బాహుబలి’ రిలీజ్ టైంకి దాని మీద హాలీవుడ్ జనాలు, నేటివ్ అమెరికన్స్ పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ ఇప్పుడు రాజమౌళిపై వారికి బాగా గురి కుదిరింది. మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమా మీద అక్కడి వాళ్లలోనూ బాగా ఆసక్తి ఉంది. ఇలాంటి టైంలో రాజమౌళి ఐకానిక్ మూవీ ‘బాహుబలి’ రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
రెండు భాగాలను కలిపి ఒకటిగా ‘ఎపిక్’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి సినిమాను రీ ఎడిట్ చేశాడు. ఈ సినిమా మొదలైనపుడు ఒక కథగానే చెప్పాలనుకున్నారు. ఇప్పుడు ఆ ప్రకారమే సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు సినిమాల్లోని హైలైట్ ఎపిసోడ్లను తీసుకుని.. క్రిస్పీగా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కొన్ని అదనపు సీన్లు కూడా యాడ్ అవుతాయంటున్నారు. దీంతో ‘బాహుబలి’ పట్ల మన ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి క్రియేట్ అవుతోంది.
అదే సమయంలో అమెరికాలో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మామూలుగా ఒక సినిమా హిట్టయ్యాక ఆ సినిమా పేరు పెట్టి ‘ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్..’ అంటూ తర్వాతి చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. అమెరికాలో ఈ చిత్రాన్ని ‘ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అంటూ జక్కన్న కొత్త సినిమా పేరు పెట్టి పాత సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. ఈ ప్రమోషన్ అమెరికన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందంటే.. ‘బాహుబలి’ కొత్తగా అక్కడ సంచలనం రేపడం ఖాయం.
This post was last modified on August 27, 2025 2:39 pm
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…