సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న ఘాటీ ప్రమోషన్లకు అనుష్క బయటికి వస్తుందేమోనని ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ తప్పదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తరహాలో దీనికి కూడా పబ్లిసిటీలో తను భాగం కాబోవడం లేదు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే రాసుకున్న టర్మ్స్ ప్రకారం అనుష్క రావడం లేదని, ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినా ఎక్స్ పెక్ట్ చేయొద్దనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పోనీ ఏదైనా వీడియో ఇంటర్వ్యూ ఉండొచ్చనే ఆశలు కూడా దాదాపు లేనట్టే. సరే ఇదంతా బాగానే కానీ అనుష్క రాకపోవడం వల్ల ఏర్పడే చిక్కు ఒకటుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలో ప్రమోషన్ల భారమంతా నవీన్ పోలిశెట్టి ఒంటి చేత్తో లాగించాడు. తన ఇమేజ్ దృష్ట్యా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకునేలా చేశాడు. దీంతో అనుష్క రాని లోటు జనాలు పెద్దగా ఫీలవ్వలేదు. కానీ ఘాటీలో హీరో విక్రమ్ ప్రభు. తమిళ బాపతు. మనకు కనీస పరిచయం లేదు. గజరాజు లాంటి డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు పలకరిస్తాడు కానీ అవేవి కనీస స్థాయిలో ఆడకపోవడంతో మన ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. సో తను వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఉండదు. ఇక దర్శకుడు క్రిష్ తన వంతుగా వీలైనన్ని విశేషాలు పంచుకోవాలి.
జగపతిబాబు, చైతన్య రావు లాంటి ఇతర క్యాస్టింగ్ ఉన్నప్పటికీ వాళ్ళెవరూ అనుష్క రాని లోటుని తీర్చలేరు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఆడేస్తాదనే ధీమా నిర్మాతల్లో ఉండొచ్చు. యువి క్రియేషన్స్ కి ఇది చాలా కీలకమైన మూవీ. పలు వాయిదాల తర్వాత ఇప్పుడు మోక్షం దక్కించుకుంటోంది. విశ్వంభర లాంటి ప్యాన్ ఇండియా సినిమాల పనులు బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో ఘాటీ హిట్టయితే దాని వల్ల రెవిన్యూ మంచి బూస్ట్ గా పనికొస్తుంది. కొండల్లో చేసే గంజాయి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఘాటీలో అనుష్క మునుపెన్నడూ చేయని వయొలెంట్ షేడ్ లో దర్శనమిస్తుందట.
This post was last modified on August 27, 2025 7:36 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…