2026 సంక్రాంతి మాములు వేడిగా లేదు. పోటీ అంతకంతా పెరుగుతూ పోతూ డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన లిస్టు చూస్తూనే థియేటర్ల సర్దుబాటు ఎలా జరుగుతుందో అంతు చిక్కడం లేదు. అలాంటిది కొత్తగా కూడా తోడవ్వడం ఇంకా విచిత్రం. ఇప్పటిదాకా ఖరారైన వాటిలో చిరంజీవి మన వరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ 77, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఉన్నాయి. వీటిలో ఏదీ వెనక్కు తగ్గే సంకేతాలు నిర్మాతల వైపు నుంచి కనిపించడం లేదు. వీటికి తోడు డబ్బింగ్ మూవీ విజయ్ జన నాయకుడుకి తెలుగులోనూ బజ్ తెచ్చేలా ఉన్నారు.
ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్యలో పరాశక్తిని దింపాలనుకోవడం సాహసమే. అయితే దర్శకురాలు సుధా కొంగర ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ మిస్ చేయడం వద్దంటూ నిర్మాతని ఒప్పించారట. శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాతో శ్రీలీల హీరోయిన్ గా కోలీవుడ్ కు పరిచయమవుతోంది. రవి మోహన్, అథర్వా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం రోజుల నాటి పరిణామాలను సుధా కొంగర బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో సూర్య దీన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. అందుకే పరాశక్తి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇలా ఇన్నేసి సినిమాలు తలపడటం వల్ల చాలా రిస్కులున్నాయి. ముఖ్యంగా రాజా సాబ్ కు తమిళనాడులో కావాల్సినన్ని థియేటర్లు దొరకడం కష్టమవుతుంది. ఇంకోవైపు జననాయగన్, పరాశక్తికి ఏపీ తెలంగాణలో స్క్రీన్లు దక్కించుకోవడం అంత సులభంగా ఉండదు. మిగిలినవి ప్యాన్ ఇండియా సినిమాలు కాదు కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఓపెనింగ్స్ పరస్పరం ప్రభావితం చేసుకునే ఇలాంటి క్లాషులు ఎంత మాత్రం సేఫ్ కాదు. గరిష్టంగా మూడు సినిమాలు మంచి రెవిన్యూ చేసుకునే స్కోప్ ఉన్న సంక్రాంతికి ఇలా నాలుగు స్ట్రెయిట్, రెండు డబ్బింగులు వస్తే బిసి సెంటర్లలో థియేటర్ల సర్దుబాటుకి బయ్యర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
This post was last modified on August 26, 2025 12:36 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…