పరదా ఓడినా అనుపమ గెలిచింది

రివ్యూలు చూసి రండి, బాగుంటేనే టికెట్లు కొనండి అంటూ తెగ ఊదరగొట్టిన పరదాకు వీక్ ఓపెనింగ్స్ తో పాటు రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. కంటెంట్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో పెద్ద స్టేట్ మెంట్లు ఇవ్వడం అన్ని వేళలా పని చేయదు. సినిమా బాగుండి మెల్లగా పబ్లిక్ టాక్ తో పికప య్యాక అప్పుడు చెప్పొచ్చు, మేము అనుకున్నట్టే మంచి రివ్యూస్ వచ్చాయి, చూశాక మీరు ఒప్పుకుంటారని సక్సెస్ మీట్స్ లో చెప్పొచ్చు.  పరదాలాగే కోర్ట్ విషయంలో నాని ఇదే తరహాలో నమ్మకాన్ని ప్రదర్శించి రిస్క్ తీసుకున్నాడు. కానీ కంటెంట్ బాగుండటంతో జనం ఆదరించారు, కలెక్షన్లు కురిపించారు.

కానీ  పరదా దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఒక సీరియస్ మెసేజ్ ని చాలా డెప్త్ గా చెప్పాలనే ప్రయత్నంలో తడబడటంతో ప్రేక్షకులను మెప్పించలేకపాయింది. ఏ మాత్రం నమ్మశక్యం కానీ ఒక దురాచారాన్ని తీసుకుని దానికి డ్రామా జోడించి విపరీతమైన సందేశాలను జొప్పించడంతో పరదా అడుగులు దారి తప్పాయి. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో వచ్చిన కంప్లైంట్స్ ఫలితం మీద ప్రభావం చూపించాయి. అనుపమ పరమేశ్వరన్ దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గా చాలా కష్టపడి నటనకు మార్కులు కొట్టేసింది. ప్రవీణ్ లాగా రివ్యూలు చూసి రమ్మని చెప్పింది. తీరా చూస్తే అవి ఆశాజనకంగా లేకపోవడం ఫైనల్ ట్విస్ట్.

వీకెండ్ ఇంత నెమ్మదిగా ఉంటే ఇక సోమవారం నుంచి జరగబోయే డ్రాప్ ఎంత స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా పరదా యావరేజ్ గా మిగిలిపోయేలా ఉంది. శుభంలోనూ ప్రవీణ్ కండ్రేగుల ఇలాంటి పొరపాట్లే చేసినప్పటికీ సమంత ఫ్యాక్టర్ ప్లస్ మార్కెటింగ్ వల్ల డీసెంట్ గా గట్టెక్కింది. కానీ పరదాలో అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇకపై అవార్డులు లాంటివి రావొచ్చేమో కానీ నిర్మాతలు డబ్బులు రావనే క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఓటిటిలో ఎక్కువగా చూసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అనుపమ మరో సినిమా కిష్కిందకాండ సెప్టెంబర్ 12 రానుంది. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో.