పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఆఖరికి రాజకీయ సభల్లో కూడా నామస్మరణతో అంచనాలు అమాంతం పెంచేసుకున్న ఓజి విడుదల సంవత్సరాలు, నెలలు నుంచి రోజుల్లోకి వచ్చేసింది. సరిగ్గా ముప్పై రోజుల్లో సెప్టెంబర్ 25న ఓజాస్ గంభీర థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఇంకో నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ ఉందని, దాని పవన్ హాజరు కావాల్సి ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ టీమ్ వాటికి స్పందించడం లేదు. దర్శకుడు సుజిత్ ఈ కథనాలను తన సన్నిహితుల దగ్గర కొట్టి పారేస్తున్నాడు. ఆరు నూరైనా వచ్చే తీరతామని, ఎలాంటి పోస్ట్ పోన్ లేదని అంటున్నాడట.
ఇదిలా ఉంచితే ఈ నెల మొత్తం ఓజి రన్ రాజా రన్ అంటూ పరుగులు పెట్టాల్సిందే. వినాయకచవితి రోజు వదలబోయే పాటను కలుపుకుని ఇప్పటిదాకా రెండు సాంగ్స్ వచ్చేసినట్టే. ఇంకా ట్రైలర్ పెండింగ్ ఉంది. కట్ చేయడం మొదలుపెట్టారో లేదో సరైన సమాచారం లేదు. టైం తక్కువ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కొంత భాగానికి ఏఐ టెక్నాలజీ అవసరం పడటంతో ఆ పనుల్లో సుజిత్ తలమునకలై ఉన్నట్టు తెలిసింది. నిర్మాత డివివి దానయ్యకు పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇచ్చేందుకు బయ్యర్లు రెడీగా ఉన్నారు. నైజామ్ తో పాటు మరికొన్ని ఏరియాలు ఇంకా ఫైనల్ చేయలేదని టాక్.
ఎంత బజ్ ఉన్నా సరే పబ్లిసిటీని నిర్లక్ష్యం చేయకూడదు. హరిహర వీరమల్లు స్థాయిలో కాకపోయినా ఉన్నంతలో మంచి ప్రమోషన్లు చేసుకుంటే ఓజికి బయట మార్కెట్లలో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే డేట్ సోలో అయిపోయింది. పోటీగా వస్తుందనుకున్న అఖండ 2 తప్పుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఓజికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు థియేటర్లు రెడీ అవుతున్నాయి. అబోవ్ యావరేజ్ అనిపించుకున్నా చాలు రికార్డులు బద్దలైపోతాయి. తమన్ సంగీతం మీదున్న ఫ్యాన్స్ మాములు నమ్మకం పెట్టుకోలేదు. సీక్వెల్ గా ఉండదని సింగల్ పార్ట్ గానే ఓజిని సుజిత్ ముగించేస్తాడని విశ్వసనీయ సమాచారం.
This post was last modified on August 25, 2025 11:06 am
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…