పాతిక రోజుల ముందుగానే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టుకుంటున్న ఓజి రికార్డుల వేటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంత ముందస్తుగా టికెట్స్ అమ్మడం వల్ల కలిగే లాభమేంటో ఇటీవలే కూలీ నిరూపించింది. బజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు ప్రీమియర్ల కోసం ఎగబడతారు. అందుకే ఓజి డిస్ట్రిబ్యూటర్ ఈ విషయంలో తెలివిగా వ్యవహారించి ఆగస్ట్ 29 నుంచి టికెట్ సేల్స్ మొదలు పెట్టడం మంచి స్ట్రాటజీ. ఎంతలేదన్నా నార్త్ అమెరికాలో మొదటి షో పడేలోపు కనీసం రెండు మిలియన్ మార్కుని దాటించాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. హైప్ చూస్తుంటే అది నిజమైనా ఆశ్చర్యం లేదు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఓజి మీద ఎంత బజ్ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమాంతం పెంచాలి. హరిహర వీరమల్లు డిజాస్టర్ ప్రభావం ఓజి మీద నేరుగా లేకపోయినప్పటికీ బయ్యర్లలో కొంత టెన్షన్ ఉండకపోదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో విపరీతమైన అంచనాలు మోసుకొచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ నిరాశపరిచాయి. వార్ 2, కూలి లాంటివి మొదటి వీకెండ్ కావడం ఆలస్యం క్రాష్ అయ్యాయి. అసలే దర్శకుడు సుజిత్ సాహో తర్వాత చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ ఇది. రెండు సినిమాల అనుభవమే ఉన్నా రాజమౌళి రేంజ్ లో ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల బిజినెస్ సైతం ఇంకో పది రోజుల్లో కొలిక్కి వచ్చేలా ఉంది. ఏపీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ ఎంత లేదన్నా 200 కోట్ల గ్రాస్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాల ప్రాధమిక అంచనా. టాక్ బాగుంటే పవన్ కళ్యాణ్ ఊచకోత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఇప్పటిదాకా డబుల్ సెంచరీ మార్క్ అందని ద్రాక్షగా మారిన పవన్ కళ్యాణ్ ఈసారి దాన్ని ఎలాగైనా అందుకోవాలని కంకణం కట్టుకున్నారు. తమన్ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. నెక్స్ట్ రాబోయే మెలోడీ పాట ఏం చేస్తుందో చూడాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ట్రైలర్ కట్ చాలా కీలకం కానుంది. సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే.
This post was last modified on August 24, 2025 2:46 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…