అన్ని సవ్యంగా అనుకున్న టైం ప్రకారం జరిగి ఉంటే ఈ వారం ఆగస్ట్ 27 మాస్ జాతర థియేటర్లలో ఉండేది. కానీ ఫెడరేషన్ సమ్మె, నిర్మాతకు కింగ్డమ్ ఫెయిల్యూర్ – వార్ 2 డిస్ట్రిబ్యూషన్ వల్ల తలెత్తిన ఇబ్బందులు, ఇలా రకరకాల కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే రవితేజ అభిమానులు సెప్టెంబర్ లో రావొచ్చనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు కానీ పరిస్థితి మాత్రం దానికి అనుకూలంగా లేదట. ప్రస్తుతమున్న సమాచారం మేరకు మాస్ జాతర కొత్త డేట్ అక్టోబర్ 31 కావొచ్చని లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారని వినికిడి.
ఇన్ సైడ్ ఇన్ఫో ప్రకారం మాస్ జాతర వర్క్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఒక పాట చిత్రీకరించాల్సి ఉందట. ఒకవేళ పాత డేట్ కే కట్టుబడి ఉంటే అది లేకుండానే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి షూట్ చేయొచ్చని అంటున్నారు. అసలు సమస్య మరొకటి ఉంది. మాస్ జాతరకు బజ్ లేదు. టీజర్ మీద రొటీన్ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. లిరికల్ సాంగ్ లో బూతుల గురించి విమర్శకులు తలంటారు. నిర్మాణంలో ఉన్నప్పటికీ దీని మీద స్పెషల్ ఇంటరెస్ట్ కలిగేలా స్పెషల్ ప్రమోషన్లు చేయలేదు. సో ఇదంతా మార్చాల్సిన పెద్ద బాధ్యత ప్రొడక్షన్ టీమ్ మీద ఉంది.
సెప్టెంబర్ లో వరసగా ఘాటీ, లిటిల్ హార్ట్స్, కాంత, కిష్కిందపురి, మిరాయ్, మదరాసి, భద్రకాళి, ఓజిలు క్యూ కట్టి ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో కాంతారా చాప్టర్ 1 ఉంది. వీటితో పోటీకి దిగడం కంటే మాస్ జాతర సోలోగా వస్తేనే ఎక్కువ లాభం ఉంటుంది. అయితే రవితేజ దీని గురించి ఏమనుకుంటున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్న మాస్ రాజా దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో పరుగులు పెట్టిస్తున్నారు. మరి దానికన్నా ముందు వచ్చే మాస్ జాతరకు కనీస గ్యాప్ ఉండటం అవసరం. వీలైనంత త్వరగా డేట్ లాక్ చేయడం మంచిది.
This post was last modified on August 23, 2025 3:44 pm
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…