Movie News

మల్టీస్టారర్లకు మహావతార్ గుణపాఠం

మహావతార్ నరసింహ అయిదో వారంలో ఉంది. మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఈపాటికి దుకాణం సర్దేయాలి. ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చి ఎప్పుడెప్పుడు సెలవు తీసుకుందామని ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఈ యానిమేటెడ్ మూవీ లెక్క వేరుగా ఉంది. లేటెస్ట్ గా రిలీజైన వార్ 2, కూలీలను దాటేసి బుక్ మై షో ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉండటం షాకింగ్ పరిణామం. మహావతార్ నరసింహకు సగటున గంటకు 6 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతు ఉండగా కూలి 5 వేలకు దగ్గరలో, వార్ టూ 3 వేల పై చిలుకు టికెట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. సాయంత్రానికి ఈ వ్యత్యాసం మరింత పెరగనుంది.

ఒకరకంగా చెప్పాలంటే మల్టీస్టారర్స్ కు మహావతార్ పెద్ద గుణపాఠం నేర్పిస్తున్నాడు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారని నిరూపిస్తున్నాడు. కొత్త రిలీజు పరదా, స్టాలిన్ లాంటి ఫ్రెష్ రీ రిలీజ్ వచ్చినా సరే వాటి ప్రభావం ఏ మాత్రం పడకపోవడం గమనించాల్సిన విషయం. జీవోల పేరుతో ఇష్టం టికెట్ రేట్లను విపరీతంగా పెంచేసుకున్న వార్ 2, కూలీలు ఆంధ్రలో ఎదురీదాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ సాధారణ ధరలకే అందుబాటులో ఉన్న మహావతార్ నరసింహకు ఫ్యామిలీస్ కదిలి వస్తున్నాయి. కంటెంట్ తో పాటు రేటు కూడా ప్రభావం చూపిస్తోంది.

ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒకటుంది. ఆడియన్స్ ఎప్పుడూ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. వర్షాలు, ఓటిటిలు కేవలం మనం వెతికే సాకులు మాత్రమే. నిజంగా కంటెంట్ బాగుంటే ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా టికెట్లు కొని మరీ సినిమాలు చూస్తారు. ఇప్పుడేదో మహావతార్ ఆడింది కాబట్టి ఇకపై అందరూ యానిమేటెడ్ మూవీస్ తీస్తే దెబ్బ తినక తప్పదు. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. విఎఫ్ఎక్స్ లో క్వాలిటీ ఉండాలి. అన్నింటిని మించి జనాలకు ఏం కావాలో దర్శకులు గుర్తించాలి. లేదంటే ఇలాంటి గుణపాఠాలు ఎన్ని నేర్చుకున్నా ఫలితం దక్కదు. నీడ్ అఫ్ ది హవర్ అంటే ఇదే.

This post was last modified on August 23, 2025 11:17 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

35 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago