Movie News

తారక్ కన్నా ఎక్కువ నష్టం హృతిక్కే

కనీసం యావరేజ్ అయినా సంతోషించే వాళ్ళు కానీ వార్ 2 డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టెంపర్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న సక్సెస్ ట్రాక్ ని ఈ సినిమా బ్రేక్ చేయడం డైజెస్ట్ కావడం లేదు. వరస హిట్లతో పదేళ్లకు పైగా ఫ్లాప్ లేకుండా నడిచిన జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ కు ఇది పెద్ద అడ్డంకిగా నిలిచిపోయింది. అయితే వార్ 2 ఇద్దరు హీరోల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందంటే నిస్సందేహంగా హృతిక్ రోషన్ కే అని చెప్పొచ్చు. ఎందుకంటే తను వేగంగా సినిమాలు చేయడం మానేశాడు. గత పది సంవత్సరాల్లో అతను చేసింది కేవలం ఏడు సినిమాలు మాత్రమే.

వాటిలో మూడు సూపర్ ఫ్లాపులు ఉన్నాయి. నెక్స్ట్ లైనప్ లో పెట్టుకున్న క్రిష్ 4కి ఎంత లేదన్నా రెండేళ్లకు పైగానే టైం పట్టేలా ఉంది. ఒకవేళ వార్ 2 బ్లాక్ బస్టర్ అయ్యుంటే క్రిష్ 4 బిజినెస్ కి చాలా హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కు నిధులు సమీకరించడం పెద్ద సవాల్ గా మారుతుంది. ఎందుకంటే మార్కెట్ కోణంలో చూసుకుంటే హృతిక్ గత సినిమాల్లో ఫైటర్ జస్ట్ హిట్ అనిపించుకోగా, విక్రమ్ వేదా దారుణంగా పోయింది. పెట్టుబడిదారులు తన విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉన్నారు. సో క్రిష్ 4 ఆశించిన వందల కోట్ల బడ్జెట్ మీద అనుమానాలు ముసురుకుంటాయి.

జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తే వార్ 2 పరాజయం చిన్న డెంట్ లాంటిది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ నీల్ మూవీకి సరిపడా బజ్ షూటింగ్ స్టేజి నుంచే వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ఫాంటసీ మూవీ గురించి నిర్మాత నాగవంశీ ఇస్తున్న హింట్లు అంచనాలను ఎక్కడికో తీసుకెళుతున్నాయి. జైలర్ 2 తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని తారక్ కోసం లాక్ చేయబోతున్నాడు. వీటికన్నా ముందు, నీల్ సినిమా తర్వాత దేవర 2కి సరిపడా ప్లానింగ్ తో కొరటాల శివ సిద్ధంగా ఉన్నారు. వార్ 2 వల్ల బాలీవుడ్ మార్కెట్ కోసం ట్రై చేయడం వృథా ప్రయాసని జూనియర్ ఎన్టీఆర్ కు అర్థమైపోయి ఉంటుంది.

This post was last modified on August 22, 2025 6:27 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

41 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

55 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago