ఒకే హీరో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం చాలా అరుదు. అందులోనూ మార్కెట్ రిస్కులు పెరిగిపోతున్న ట్రెండ్ లో అలాంటి సాహసానికి ఎవరూ ఒడిగట్టరు. లవ్ టుడేతో యూత్ సెన్సేషన్ గా మారిన ప్రదీప్ రంగనాధన్ కు ఈ అనుభవం ఎదురయ్యేలా ఉంది. చెన్నై రిపోర్ట్స్ ప్రకారం అతని కొత్త మూవీస్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, డ్యూడ్ అక్టోబర్ 17 విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయట. ఒకవేళ సేమ్ డేట్ అయినా కాకపోయినా చాలా తక్కువ గ్యాప్ ఉంటుందనే గుసగుస చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి అరుదైన ఫీట్ ఇప్పుడున్న స్టార్లలో ఇద్దరికీ జరిగింది.
మొదటి హీరో నందమూరి బాలకృష్ణ. 1993 సెప్టెంబర్ 3 బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు క్లాష్ అయ్యాయి. నిజానికి నిర్మాతలకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల వేరే ఆప్షన్ లేక ఇలా చేశారు. వీటిలో మొదటిది సూపర్ హిట్ కాగా రెండోది అంచనాలు అందుకోలేకపోయింది. విడిగా వచ్చి ఉంటే నిప్పురవ్వ కొంచెం బెటర్ గా ఆడేదని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. 2015 మార్చి 21 న్యాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు పరస్పరం తలపడ్డాయి. బాలయ్య లాగే నానికి కూడా అదే ఫలితం రిపీట్ అయ్యింది. మీడియాలో ఈ సెల్ఫ్ క్లాష్ మీద రకరకాల కథనాలొచ్చాయి.
ఇప్పుడు ప్రదీప్ రంగనాధన్ దీన్ని ఎలా రిపీట్ చేస్తాడో చూడాలి. దీపావళి పండగ కోలీవుడ్ కు కీలకం కావడంతో ఇద్దరు ప్రొడ్యూసర్లు మేమంటే మేమని పోటీ పడుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. డ్యూడ్ నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్. ఇందులో మంచి గ్లామర్ కోటింగ్ ఉంది. కీర్తీశ్వరన్ దర్శకుడు. మరి ప్రదీప్ తనతో తనే తలపడతాడా లేక ఎవరినో ఒకరిని ఒప్పించి వెనక్కు తగ్గేలా చూస్తాడా అనేది వేచి చూడాలి. ఒకవేళ క్లాష్ నిజమే అయితే మాత్రం బాలయ్య,నాని సరసన నిలుస్తాడు.
This post was last modified on August 22, 2025 10:36 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…