చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజైన స్టాలిన్ బాక్సాఫీస్ దగ్గర ఎదురీదుతోంది. హైదరాబాద్ మెయిన్ సింగల్ స్క్రీన్లు, విజయవాడలో ఒకటి రెండు థియేటర్లు మినహాయించి తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఆశించిన స్పందన రాలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని షోలు క్యాన్సిల్ కావడం అసలు ట్రాజెడీ. మెగాస్టార్ పుట్టినరోజుని ఒక సంబరంలా జరుపుకునే ఫ్యాన్స్ దీనికి దూరంగా ఉండటం విచిత్రం. అందులోనూ స్వంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ మీద నాగబాబు నిర్మించిన మూవీ ఇది. ప్రకటన స్టేజి నుంచే దీని మీద అభిమానులు అంతగా ఆసక్తి చూపించని వైనం సోషల్ మీడియాలో కనిపించింది.
మెయిన్ రిలీజ్ టైంలో స్టాలిన్ యావరేజ్ అయినప్పటికీ ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తోంది కాబట్టి ఆరంజ్ తరహాలో ఫ్యాన్స్ మద్దతు ఉంటుందని బయ్యర్లు ఆశించారు. కానీ జరిగింది వేరు. స్టాలిన్ కు ఇంత లో రెస్పాన్స్ రావడానికి కారణాలు లేకపోలేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి బెదిరించే సీన్, ఇంట్రో సాంగ్, క్లైమాక్స్ లో సునీల్ డైలుగులు తప్ప స్టాలిన్ లో రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ తక్కువ. మిలిటరీ ఫ్లాష్ బ్యాక్ అయితే టోటల్ మిస్ ఫైర్ అయ్యింది. అన్నింటిని మించి ఇంద్ర, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా లాగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సాంగ్స్ స్టాలిన్ లో లేవు.
నిజానికి స్టాలిన్ బదులు ఈ అకేషన్ లో ఠాగూర్ రీ రిలీజ్ చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. లేదంటే రౌడీ అల్లుడు లాంటి వింటేజ్ మాస్ ని తీసుకొచ్చినా ఎంజాయ్ చేసేవాళ్లమని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా లెక్క తప్పింది. అయినా ఈ మధ్య గమనిస్తే ఆగస్ట్ రీ రిలీజులు పెద్దగా ఆడట్లేదు. రికార్డులు బద్దలు కొడుతుందని భావించిన అతడు మహేష్ బాబు పుట్టినరోజుకు ఎలాంటి మేజిక్ చేయలేదు. ఇప్పుడు స్టాలిన్ వరస చూస్తేనేమో ఇలా ఉంది. ఒకవేళ ఠాగూర్ అయ్యుంటే మణిశర్మ పాటలు, వివి వినాయక్ మాస్, చిరు శ్రేయల స్టెప్పులు వెరసి థియేటర్లలో మాస్ సెలబ్రేషన్స్ జరిగేవి. ఛాన్స్ మిస్సయ్యింది.
This post was last modified on August 22, 2025 5:03 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…